Enjoy Enjaami: 48 కోట్ల వ్యూస్‌.. ఒక్క రూపాయి రాలేదు: నిర్మాత ఆరోపణలు

‘ఎంజాయ్‌ ఎంజామి’ వల్ల తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని సంతోష్‌ నారాయణన్‌ ఆరోపణలు చేశారు. 

Published : 08 Mar 2024 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఎంజాయ్‌ ఎంజామి’ (Enjoy Enjaami).. దాదాపు మూడేళ్ల క్రితం సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఆల్బమ్‌ ఇది. గాయని ఢీ, తమిళ రాపర్‌ అరివు తారాగణంగా సంతోష్‌ నారాయణన్‌ నిర్మించారు. యూట్యూబ్‌లో చాట్‌బస్టర్‌గా నిలిచింది. ఇది విడుదలై మూడేళ్లు అయిన సందర్భంగా సంతోష్‌ తాజాగా స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. కోట్లలో వ్యూస్‌ దక్కించుకున్న ఈ పాట వల్ల తాము ఏమాత్రం ప్రయోజనం పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఎంజాయ్‌ ఎంజామి’ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. బిలియన్లలో స్ట్రీమింగ్స్‌ అందుకుంది. అయితే, దీనివల్ల మేము ఎంత డబ్బు సంపాదించామో చెప్పాలనుకుంటున్నా. సున్నా. నిజం, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ విషయంపై పాటను విడుదల చేసిన మజ్జా లేబుల్‌ను సంప్రదించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాం. దురదృష్టవశాత్తు ప్రయోజనం లేకుండా పోయింది. ఆ లేబుల్‌ మాత్రం భారీ మొత్తంలో రెవెన్యూ అందుకుంది’’ అని ఆయన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని