shahrukh khan: ‘బేషరమ్ రంగ్’ దుమారం.. షారుఖ్ కౌంటర్!
‘బేషరమ్‌రంగ్’ పాట విషయంలో సోషల్‌మీడియాలో వస్తున్న విమర్శలపై కథానాయకుడు షారుఖ్ తనదైన శైలిలో స్పందించారు.
కోల్‌కతా: ప్రేక్షకులు, అభిమానులు తమని ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకుంటుంది? ఏం చేస్తుందన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ (shahrukh khan) అన్నారు. ఆయన కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’. దీపిక పదుకొణె కథానాయిక. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ‘బేషరమ్ రంగ్’ అంటూ సాగే ఓ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో హాట్ హాట్ అందాలతో దీపిక నటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా వేదికగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో షారుఖ్ మాట్లాడారు.
‘‘సోషల్‌మీడియా కొన్నిసార్లు సంకుచిత దృష్టికోణంతో చూస్తూ ఉంటుంది. కొంతమంది ప్రవర్తన అంతే. సోషల్‌మీడియా వినియోగం వల్ల నెగెటివిటీ పెరుగుతుందని నేను ఎక్కడో చదివాను. అలాంటివి పనులు మనుషుల మధ్య విభేదాలు సృష్టించి, నాశనం చేస్తాయి. కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లాంటివి సానుకూల దృక్పథాన్ని కల్పిస్తాయి’’ అని అన్నారు. ‘పఠాన్’ను బాయ్‌కాట్ చేయాలని, దీపిక పదుకొణె హాట్ సన్నివేశాలను సరి చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో షారుఖ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: నేనంటే ఇష్టం లేదు కదా..? ‘ఓవల్ పిచ్ డాక్టర్’తో అశ్విన్ చిట్‌చాట్
-
General News
KTR: తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది: మంత్రి కేటీఆర్
-
India News
Flight Passenger: విమానంలో బాంబు అంటూ ప్రయాణికుడి కేకలు!
-
India News
Odisha Accident: ‘అతడి తల ఫుట్బాల్లా వచ్చి నా ఛాతీపై పడింది’.. షాక్‌లో అస్సాం యువకుడు!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
WTC final: ఫేవరెట్ ఎవరో చెప్పడం కష్టం.. భారత బౌలింగ్ అటాక్‌లో ప్రధాన అస్త్రం అతడే: డివిలియర్స్