Sharwanand: ‘శ్రీకారం’ చుట్టుకుంది పెళ్లి పుస్తకం
కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ఓ ఇంటివాడయ్యారు. శనివారం రాత్రి రక్షిత మెడలో మూడుముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ఓ ఇంటివాడయ్యారు. శనివారం రాత్రి రక్షిత (Rakshita Reddy) మెడలో మూడుముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. రెండు రోజుల పాటు సాగిన వేడుకల్లో రామ్‌చరణ్, సిద్ధార్థ్, అదితీరావు హైదరి, దిల్‌రాజు తదితర సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్ని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. శర్వా - రక్షిత పెళ్లి దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించారు. ఈ కొత్త జంటకు పలువురు సినీ తారలు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి రిసెప్షన్‌ను జూన్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddaramaiah: అప్పులు తెచ్చుకొని.. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవద్దు: కర్ణాటక సీఎం
-
Hyderabad: గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!
-
PM Modi: నాకు సొంతిల్లు లేదు.. కానీ: ప్రధాని మోదీ
-
Bank Jobs: ఎస్బీఐలో 2వేల పీవో పోస్టులు.. దరఖాస్తుల గడువు పొడిగింపు
-
ఆ నిశ్శబ్దం ఎనిమిదేళ్లు నిద్రలేకుండా చేసింది: దర్శకుడు
-
Adani Group: అదానీ పోర్ట్స్ 195 మిలియన్ డాలర్ల బాండ్ల బైబ్యాక్