Shobha shetty interview: హౌస్‌లో ఉన్న వాళ్లలో అతడే మాస్టర్‌ మైండ్‌..: శోభాశెట్టి!

Shobha shetty interview: బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి ఎలిమినేట్‌ అయిన శోభాశెట్టి, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు.

Updated : 11 Dec 2023 16:09 IST

Shobha shetty interview: బిగ్‌బాస్‌ జర్నీ తన లైఫ్‌లో పూర్తయిపోయిందని, హౌస్‌మేట్స్‌ గురించి బయట మాట్లాడాల్సిన అవసరం లేదని నటి శోభాశెట్టి అన్నారు. తన తల్లి కోరిక మేరకు చివరి వరకూ హౌస్‌లో ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

మీకు అలా అనిపించి ఉండవచ్చు!

‘‘హౌస్‌లో ఎవరినీ కావాలని టార్గెట్‌ చేయలేదు. కేవలం ఆటపరంగా మాత్రమే అలా ఉండాల్సి వచ్చింది. మీకు బయటకు ఎలా కనిపించిందో నాకు తెలియదు. యావర్‌ నన్ను, నేను అతన్ని వరుసగా రెండు, మూడు వారాలు నామినేట్‌ చేయడం వల్ల నేను అతడిని టార్గెట్‌ చేసినట్లు మీకు అనిపించి ఉండవచ్చు. నేను (shobha shetty interview) ఎవరిపైనా రివెంజ్‌ నామినేషన్‌ వేయలేదు. సిల్లీ రీజన్స్‌కు నన్ను నామినేట్‌ చేస్తే, నేనూ అలాగే చేశా. అంతకుమించి ఏమీ లేదు. వచ్చిన ఒక్కరోజులోనే నామినేషన్స్‌ అంటే ఎలా చేస్తాం చెప్పండి. అందుకే గౌతమ్‌ నాతో సరిగా మాట్లాడలేదని అతడిని నామినేట్‌ చేయాల్సి వచ్చింది’’

నా స్వీట్‌ మెమొరీస్‌ అన్నీ తేజతోనే..!

‘‘హౌస్‌లో 10మంది సభ్యులు ఉండగా, అందరూ కలిసి నన్ను ఏడో స్థానంలో ఉంచారు. అప్పుడు అర్జున్‌ చెప్పిన కారణం నచ్చలేదు. ఇప్పుడు ఏడో స్థానంలో ఉన్న వ్యక్తిగానే బయటకు వచ్చా. అందుకు నేనేమీ బాధపడటం లేదు. అదృష్టం కొద్దీ నేను ఇన్ని వారాలు హౌస్‌లో ఉన్నానని మీరు అభిప్రాయపడితే నేనేమీ చేయలేను. (shobha shetty interview) నా జర్నీలో స్వీట్‌ మెమొరీస్‌ అంటే టేస్టీ తేజతోనే ఉన్నాయి. స్టేజ్‌పై జర్నీ చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. తేజ చెప్పడం వల్లే అమర్‌ నన్ను కెప్టెన్‌ చేశాడన్నది అబద్ధం. ఆ విషయంపై నాగార్జునగారు కూడా క్లారిటీ ఇచ్చారు. అందుకే ఆ సమయంలో తేజపై అరిచాను. హౌస్‌ నుంచి బయటకు వెళ్లాక తేజ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేనేమీ అతని కోసం బిగ్‌బాస్‌కు రాలేదు కదా! నాకు నచ్చినట్లు నేను ఉన్నా’’

అది మిస్సయిపోయింది!

‘‘హౌస్‌లోకి వెళ్లకముందే అమర్‌ గురించి నాకు తెలుసు. కాకపోతే, ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ తెలుసుకున్నా. తనకు ఏమనిపిస్తే అది చేస్తాడు.  అమర్‌ నన్ను కెప్టెన్‌ను చేశాడు. అందుకే టికెట్‌ టు ఫినాలే రేస్‌లో నా పాయింట్లను ప్రియాంకకు కాకుండా అమర్‌కు ఇచ్చా. ఒక వీకెండ్‌లో ప్రియాంకకు ‘సెల్ఫ్‌గేమ్‌’ అనే ట్యాగ్‌ ఇవ్వడానికి కారణం ఉంది. అప్పుడు ప్రియాంక ఒంటరిగా ఆడకుండా గ్రూప్‌గా ఆడుతోందనే నాగార్జున సర్‌తో సహా అందరూ ఆరోపించారు. దాంతో ‘నువ్వు సెల్ఫ్‌ గేమ్‌ ఆడటం లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకో’ అని చెప్పి ఆ ట్యాగ్‌ ఇచ్చా. హౌస్‌లోకి మా అమ్మ వచ్చినప్పుడు చివరిదాకా ఉండమని చెప్పింది. అది మిస్సయిపోయింది. బయట ఇంకేదో పెద్ద అవకాశం ఉండి ఉంటుంది. అందుకే వచ్చేశానేమో. ఇప్పటివరకూ నా బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఎక్కడా చెప్పలేదు. బిగ్‌బాస్‌ ద్వారానే అతడిని రివీల్‌ చేశా’’

అదృష్టం కలిసి రాలేదు!

‘‘అర్జున్‌, అమర్‌లకు నేను సపోర్ట్‌ చేస్తా.  ప్రియాంక కన్నా అమర్‌ బాగా ఆడతాడు. ఒకవేళ గేమ్‌ ఆడేటప్పుడు తప్పులు చేసినా, తిరిగి సరిచేసుకుంటాడు. ఇక టాప్‌-1లో ఎవరు ఉండాలన్న విషయాన్ని ప్రేక్షకులు నిర్ణయిస్తారు. వండర్‌ విమెన్‌ కిరీటం ప్రియాంకకు ఇచ్చారు. దానికి కారణం ఉంది. (shobha shetty interview) అంతకుముందు ప్రియాంక, అమర్‌లకు మధ్య గొడవ అయింది. దాన్ని కాంప్రమైజ్‌ చేసుకోవడం కోసం ఆమె బాగుందని అమర్‌ చెప్పాడు. హౌస్‌లో నేను ఫస్ట్‌ లేడీ హౌస్‌మేట్‌, లేడీ కెప్టెన్‌ అయినా, టాప్‌-5లో ఉండకపోవడానికి కారణం అదృష్టం కలిసి రాలేదు. నేను చేసింది ప్రేక్షకులకు నచ్చలేదేమో. ప్రతి మనిషికీ అదృష్టం కూడా కలిసి రావాలి’’

నా వ్యాఖ్యల వల్ల తీర్పు మారదు!

‘‘శివాజీసర్‌ స్ట్రాటజీతో మెంటల్‌ గేమ్ ఆడుతున్నారు. బిగ్‌బాస్‌లో ఉండాలంటే అది కచ్చితంగా తెలియాలి. దాన్ని గ్రిప్‌లో పెట్టుకున్నారు. ఇంటర్వ్యూల్లో వాళ్ల గురించి, వీళ్ల గురించి చెప్పమని అడిగితే నేను చెప్పను. దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. భోలే, యావర్‌లపై నేను మాట్లాడిన మాటలు సరికాదు. (shobha shetty interview) వాళ్లు అన్నదాని బట్టే నేను మాట్లాడాల్సి వచ్చింది. హౌస్‌లో చాలా తప్పులు జరిగాయి. నేనూ చేసి ఉంటా. బయటకు వచ్చాక ఒకరిపై ఆరోపణలు చేయడం సరికాదు. నా అభిప్రాయాలు, వ్యాఖ్యల వల్ల మీ తీర్పు మారదు కదా. అందుకే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడటం అనవసరం’’

హౌస్‌లో ఉన్న ఆరుగురి గురించి శోభ ఏమన్నదంటే?

  • శివాజీ: జనాలు ఏం చూస్తున్నారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకూ మెంటల్‌ గేమ్‌, స్ట్రాటజీపరంగా ఎలా ఆడితే జనాలకు నచ్చుతుంది? ఎలా ఆడితే నేను సర్వైవ్‌ అవ్వగలను అన్న ప్లానింగ్‌ ఉన్న వ్యక్తి. మాస్టర్‌ మైండ్‌. ఇలా ఆడితేనే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగలం. ట్రోఫీ గెలవగలం.
  • ప్రియాంక: చాలా బాగా ఆడుతోంది. తనతో లేకుండా ముందుగా బయటకు వచ్చినందుకు కొంచెం అసూయగా ఉంది.
  • అమర్‌: అమర్‌ వల్లే నాకు ఫౌల్‌ గేమర్‌ అనే పేరు వచ్చింది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. శోభ గురించి తెలిసి కూడా నేను వెన్నుపోటు పొడుస్తానని అనడం సరికాదు.
  • అర్జున్‌: అర్జున్‌ మొదటి వారం వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. టాప్‌-5లో ఉండాల్సిన వ్యక్తి. ఫినాలే టాస్క్‌లు అన్నీ సొంతంగా ఆడి గెలుచుకున్నాడు. అర్జున్‌ను అందరూ సపోర్ట్‌ చేయండి.
  • యావర్‌: ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువ. కోపం కూడా. తొందరగా అపార్థం చేసుకుంటాడు. దేనికీ అడ్జెస్ట్‌ అవ్వడు.
  • ప్రశాంత్‌: కొంచెం మంచోడు.. కొంచెం మంచోడు కాదు. అమాయకుడని మనం అనుకుంటాం. కానీ, కాదు. అతనికి అంతా తెలుసు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఆడుతున్నాడు. జనాల పల్స్‌ బాగా తెలుసు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని