Pathaan: ‘పఠాన్’ సినిమా భారతీయులంతా గర్వపడేలా ఉంటుంది: సిద్ధార్థ్ ఆనంద్
షారుక్(Shah Rukh Khan) హీరోగా నటించిన పఠాన్ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై ఆ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: షారుక్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసింది. హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) స్పందిస్తూ ట్రెలర్‌కు వచ్చిన ప్రేక్షకాదరణ చూసి సంతోషమేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పఠాన్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇప్పటి వరకు ‘పఠాన్’ నుంచి విడుదలైన రెండు పాటలు సంచలనం సృష్టించాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమా అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. ఎంతో జాగ్రత్తగా దీనిని రూపొందించాం. సినిమా ఏ స్థాయిలో ఉందో ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాం. ట్రైలర్‌లో చూసింది కొంచెం మాత్రమే.. చూడాల్సింది సినిమాలో చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వపడేలా ఈ చిత్రం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే హాలీవుడ్ చిత్రాలను తలపించేలా దీనిలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కచ్చితంగా పఠాన్ అందరినీ అలరిస్తుంది’’ అని సిద్ధార్థ్ ఆనంద్ అన్నారు.
పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కొంతకాలం నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. భారీ అంచనాల మధ్య జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సుదీర్ఘ విరామం తర్వాత షారుక్ సినిమా వస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: అనుష్కను చూసి వణికిపోయా: విరాట్ కోహ్లీ
-
General News
Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ
-
India News
₹10 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రికి బెదిరింపులు.. గడ్కరీ ఇంటి వద్ద భద్రత పెంపు!
-
Movies News
Payal Rajput: పాయల్ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్లో పాల్గొని!
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి