Sini Shetty: మిస్‌ వరల్డ్‌ పోటీలు.. బ్లాక్‌ గౌనులో సినీశెట్టి మెరుపులు

‘బెస్ట్‌ డిజైనర్‌ డ్రెస్‌ ఫ్రమ్‌ ఆసియా అండ్‌ ఓషియానియా’గా సినీశెట్టి నిలిచారు. 

Published : 06 Mar 2024 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మిస్‌ వరల్డ్‌’ 2024 పోటీలు ముంబయిలో అట్టహాసంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ‘ది టాప్‌ మోడల్‌’ పోటీల్లో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌- 2022 సినీశెట్టి పాల్గొన్నారు. ప్రముఖ డిజైనర్‌ రాఖీ స్టార్‌ డిజైన్‌ చేసిన బ్లాక్‌ కలర్‌ గౌను.. సింపుల్‌ జ్యువెలరీతో ర్యాంప్‌పై హొయలొలికించారు. ఆమె లుక్‌కు ఫ్యాషన్‌ ప్రియులతోపాటు న్యాయ నిర్ణేతలు సైతం ఫిదా అయ్యారు. ‘బెస్ట్‌ డిజైనర్‌ డ్రెస్‌ ఫ్రమ్‌ ఆసియా అండ్‌ ఓషియానియా’గా ఆమె విజయాన్ని అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘రాఖీ స్టార్‌ డిజైన్‌ చేసిన దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి పంచింది’ అని సినీ పేర్కొన్నారు.

ప్రపంచ సుందరి పోటీలకు ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యం అందిస్తోన్న విషయం తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు కిరీటాన్ని గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 18న మొదలైన ఈ పోటీలు మార్చి 9తో ముగియనున్నాయి. దిల్లీలోని భారత్‌ మండపం, ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వీటిని నిర్వహిస్తున్నారు. భారత్‌కు సినీశెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిరీటాన్ని దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ పోటీలో ఐశ్వర్యారాయ్‌ పాటకు ఆమె డ్యాన్స్‌ చేసి మెప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని