Sohel: ఫ్యామిలీ మూవీ చేస్తే మీరేం చేస్తున్నారు: సోహైల్‌ కన్నీరు

సోహైల్‌ హీరోగా నటించిన ‘బూట్‌కట్‌ బాలరాజు’ ఫిబ్రవరి 2న విడుదలైంది. సినీ ప్రియులు తప్పకుండా తన చిత్రాన్ని ఆదరించాలని ఆయన కోరారు.

Published : 03 Feb 2024 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు సోహైల్‌ (Sohel). ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకుడు. తాజాగా ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే ఊహించిన స్థాయిలో స్పందన రాకపోవడంపై ఆయన ఆవేదనకు గురయ్యారు. ఫ్యామిలీ సినిమాలు చేయమంటారు.. మరి చేస్తే చూడరెందుకు? అని ప్రశ్నించారు.

Poonam Pandey: నేను బతికే ఉన్నా: పూనమ్‌ పాండే

‘‘ఫ్యామిలీ సినిమాలు కాకుండా.. ముద్దులు పెట్టే చిత్రాలు చేస్తా. ఎందుకంటే, ఫ్యామిలీతో చూసే సినిమాలు చేయమని కామెంట్స్‌ పెడతారు. అలాంటి సినిమా చేస్తే మీరేం చేస్తున్నారు? కుటుంబమంతా కలిసి చూసే సినిమా చేశా. నా స్థోమత మేరకు ప్రమోషన్స్‌ చేశా. కంటెంట్‌ బాగున్నా.. ప్రమోషన్స్‌కు సరిపడా డబ్బు లేనప్పుడు నేనేం చేయాలి? చూసిన వాళ్లందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అందరూ నా సినిమాకు వెళ్లండి ’’ అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి దీనిపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు సోహైల్‌ను సపోర్ట్‌ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం కంటెంట్‌ ఉంటే ఎలాగైనా సినిమా హిట్‌ అవుతుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని