Tollywood: శ్రీరామ నవమి స్పెషల్.. సందడి చేస్తోన్న కొత్త పోస్టర్లు
శ్రీరామనవమి సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు (new posters) విడుదలయ్యాయి. దర్శక నిర్మాతలు వారి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లను నెటిజన్లతో పంచుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పండగ వచ్చిందంటే సినీ ప్రియులు కొత్త సినిమాల లేటెస్ట్ (Tollywood) అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇక ఈరోజు శ్రీరామ నవమి (Srirama navami special) సందర్భంగా ఓ వైపు సంబరాలు అంబరాన్ని అంటుతుండగా మరో వైపు సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ల సందడి నెలకొంది. ఇప్పటికే నాని ‘దసరా’ (Dasara)తో ప్రేక్షకులకు పండగ తీసుకొస్తే.. ప్రభాస్ రాముడిగా (Adipurush) కనిపిస్తూ కొత్త పోస్టర్‌తో ఉత్సాహం నింపాడు. అలాగే ‘పొన్నియిన్ సెల్వన్2’ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. పండగని పురస్కరించుకొని చాలా మంది దర్శక నిర్మాతలు వారి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను నెటిజన్లతో పంచుకుంటున్నారు. అవేంటో చూసేద్దాం.
ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ చిత్రబృందం ‘ఆదిపురుష్’ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘మంత్రం కంటే గొప్పది నీ నామం’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ అయిన ఈ పోస్టర్ (Adipurush poster) ప్రస్తుతం వైరలవుతోంది. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ (Prabhas) నటిస్తుండగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ అలరించనుంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
నారా లోకేశ్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Seethakka: నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు: హైకోర్టులో సీతక్క పిటిషన్
-
Mahabubabad: జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
-
Peddha Kapu-1 Movie Review: రివ్యూ: పెదకాపు.. విరాట్, శ్రీకాంత్ అడ్డాల మూవీ మెప్పించిందా?
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
-
Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం