Sriya Reddy: ఆ రంగు విషయంలో ప్రశాంత్‌ నీల్‌తో గొడవ పెట్టుకున్నా: శ్రియా రెడ్డి

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ (Salaar). యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియారెడ్డి నటించారు. రాధారమ పాత్రను ఆమె పోషించారు.

Published : 26 Dec 2023 01:51 IST

హైదరాబాద్‌: ‘సలార్‌’ (Salaar) సినిమా తర్వాత చెవులకు సర్జరీ చేయించుకున్నానని నటి శ్రియారెడ్డి (Sriya Reddy) తెలిపారు. రాధారమ పాత్ర కోసం తాను చాలా బరువైన చెవిపోగులు ధరించానని.. షూట్‌లో భాగంగా ఎక్కువసేపు వాటిని పెట్టుకోవడం వల్ల చెవులు తెగాయని ఆమె వెల్లడించారు. సినిమా షూట్‌ పూర్తైన వెంటనే తాను సర్జరీకి వెళ్లానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అనంతరం కాస్ట్యూమ్స్‌ గురించి శ్రియారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రశాంత్‌ నీల్‌ చిత్రాల్లో కాస్ట్యూమ్స్‌ డార్క్ కలర్స్‌లోనే ఉంటాయి. ‘సలార్‌’లోనూ బ్లాక్‌, గ్రే, ఆలీవ్‌ గ్రీన్‌.. వంటి రంగులనే ఎక్కువగా వాడారు. ఓ సన్నివేశంలో పసుపు రంగు చీర ధరిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఇదే విషయాన్ని ప్రశాంత్‌కు చెప్పా. దానికి ఆయన అంగీకరించలేదు. ఆయనతో గొడవపడి మరీ, ఆ రంగు చీర ధరించా. సినిమా మొత్తంలో ఆ సీన్‌లోనే కాస్త విభిన్నమైన కలర్‌ కనిపిస్తుంది’’ అని ఆమె చెప్పారు. ‘సలార్‌’ చిత్రానికి వస్తోన్న ఆదరణ పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ‘సలార్‌ 2’ మరో స్థాయిలో ఉండనుందని చెప్పారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే దాదాపు రూ.402 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు