Suriya: సూర్య- దుల్కర్‌ కాంబో ఫిక్స్‌.. ఆసక్తి రేకెత్తించేలా వీడియో

సూర్య హీరోగా తెరకెక్కనున్న #Suriya43లో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. డైరెక్టర్‌ ఎవరంటే?

Updated : 26 Oct 2023 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ అగ్ర హీరోలో ఒకరైన సూర్య (Suriya), మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) కాంబినేషన్‌ ఖరారైంది. వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కొంతకాలంగా వినిపించిన రూమర్స్‌ నిజమయ్యాయి. ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) (Soorarai Pottru) తో హిట్‌ కాంబోగా నిలిచిన డైరెక్టర్‌ సుధా కొంగర (Sudha Kongara), సూర్యతో మరో చిత్రం చేయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులోనే దుల్కర్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని టాక్‌ వినిపించింది. తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడింది. సోషల్‌ మీడియా వేదికగా దర్శకురాలు సుధా కొంగర, సూర్య తమ కొత్త ప్రాజెక్టు వివరాలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

ఘనంగా వెంకటేశ్‌ రెండో కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సినీ ప్రముఖులు

ఈ మేరకు విడుదల చేసిన వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. #suriya43 వర్కింగ్‌ టైటిల్‌గా ఉన్న ఈ సినిమాలో మలయాళ నటి నజ్రియా (Nazriya Nazim), బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma) ఇతర కీలక పాత్రలు పోషించనున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న 100వ చిత్రమిది. ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో ‘సూరారై పోట్రు’ జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాని సుధా కొంగర హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) హీరోగా నటిస్తుండగా, సూర్య అతిథిగా కనిపించనున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు