Suriya: హీరో సూర్యకు స్వల్ప గాయాలు.. షూటింగ్ నిలిపివేత..!

‘కంగువా’ (Kanguva)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు నటుడు సూర్య (Suriya). ఈ సినిమా చిత్రీకరణలో తాజాగా ఆయనకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

Published : 23 Nov 2023 14:07 IST

చెన్నై: సూర్య (Suriya) కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కంగువా’ (Kanguva). ప్రస్తుతం ఈ సినిమా షూట్ చెన్నైలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్‌లో సూర్యకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన షూట్‌లో రోప్‌ కెమెరా ప్రమాదవశాత్తు సూర్య భుజంపై పడింది. దీంతో ఆయన భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే చిత్రబృందం షూటింగ్‌ను నిలిపివేసిందని స్థానిక ప్రతికల్లో వార్తలు వస్తున్నాయి. దీనిపై సూర్య అభిమానులు స్పందిస్తూ ‘గెట్ వెల్‌ సూన్‌’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

అలియాని హీరోయిన్‌గా తీసుకోవద్దని ఇద్దరు హీరోలు మెసేజ్‌ పెట్టారు: ప్రముఖ దర్శకుడు

కంగ అనే ఓ పరాక్రముడి కథతో పీరియాడికల్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దిశా పఠానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 38 భాషల్లో విడుదల చేయనున్నామని ఇటీవల నిర్మాత జ్ఞానవేల్‌ రాజా తెలిపారు. 3డీ, ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో ఇది అందుబాటులో ఉండనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని