Suriya: ‘రోలెక్స్‌’పై మూవీ.. రంగం సిద్ధం: సూర్య

నటుడు సూర్య  (Suriya) తాజాగా అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన తన తదుపరి చిత్రాల విశేషాలు పంచుకున్నారు.

Published : 13 Aug 2023 16:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ‘విక్రమ్‌’ (Vikram)లో రోలెక్స్‌ (Rolex)గా కనిపించిన ప్రేక్షకులను అలరించారు నటుడు సూర్య (Suriya). నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న లుక్‌లో సూర్య కనిపించిన తీరు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేసింది. రోలెక్స్‌ పాత్రపై పూర్తి సినిమా చూడాలని ఉందంటూ సూర్య అభిమానులు కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్ట్‌ గురించి సూర్య క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన.. తన తదుపరి ప్రాజెక్ట్స్‌ విశేషాలను పంచుకున్నారు.

‘‘ప్రస్తుతం నేను ‘కంగువా’ పనుల్లో బిజీగా ఉన్నా. మేము ఊహించిన దానికంటే వందరెట్లు అద్భుతంగా ఇది వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి నా 43వ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్‌ వివరాలను త్వరలో వెల్లడిస్తా. దర్శకుడు వెట్రిమారన్‌ ‘విడుదలై 2’ షూట్‌లో బిజీగా ఉన్నారు. ఆయన ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత మా కాంబోలో ‘వాడి వసల్‌’ మొదలవుతుంది. ఇక, లొకేశ్‌ కనగరాజ్‌ రోలెక్స్‌పై కథ చెప్పారు. అది నాకెంతో నచ్చింది. అది కూడా త్వరలోనే మొదలవుతుంది. రోలెక్స్‌ పూర్తయ్యాక  ‘ఇరుంభుకై మాయావి’ చేస్తాం’’ అని ఆయన చెప్పారు. దీనిపట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Nelson: నాపై కోపంగా ఉందా అని విజయ్‌ని అడిగా: నెల్సన్‌

‘విక్రమ్‌’ మూవీలో డ్రగ్‌ మాఫియాను శాసించే రోలెక్స్‌ పాత్రలో తళుక్కున మెరిశారు సూర్య. క్లైమాక్స్‌లో ఆయన కనిపించింది కొద్ది సేపే అయినా, థియేటర్‌ దద్దరిల్లిపోయింది. ఈ పాత్రను బేస్‌ చేసుకుని లోకేశ్‌ సినిమా చేస్తారంటూ గతంలో ప్రచారం సాగింది. తాజాగా సూర్య వ్యాఖ్యలతో ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చింది. మరోవైపు లోకేశ్‌ ప్రస్తుతం ‘లియో’ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని