Suriya: థియేటర్లను షేక్‌ చేస్తోన్న సూర్యా భాయ్‌.. 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని క్రేజ్‌

తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో సూర్య (Suriya) క్రేజ్‌ కనిపిస్తోంది. ఆయన నటించిన ఓ ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం రీ రిలీజ్‌ అయ్యింది.

Published : 04 Aug 2023 13:20 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ స్టార్‌ సూర్య (Suriya)కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజైన ఆయన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు.

సూర్య (Suriya) ద్విపాత్రాభినయంలో నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (Surya Son Of Krishnan). సిమ్రన్‌, సమీరారెడ్డి, దివ్యా శ్రీపాద కథానాయికలు. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2008లో విడుదలై మంచి టాక్‌ అందుకుంది. తండ్రీ తనయులుగా సూర్య నటన, హరీశ్‌ జయరాజ్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కాజోల్‌ అన్న మాటలకు షారుఖ్‌ అహం దెబ్బతింది.. భుజం పట్టేసింది

గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతోన్న రీ రిలీజ్‌ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం శుక్రవారం ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. దీంతో ఆయా థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని