Tamannaah: అలా ఉండడానికి ఇష్టపడతాను.. తన బ్యూటీ సీక్రెట్‌ చెప్పిన తమన్నా

తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్‌ వీక్‌లో తమన్నా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన బ్యూటీ సీక్రెట్‌ చెప్పింది.

Updated : 14 Mar 2023 13:42 IST

హైదరాబాద్‌: మిల్కీ బ్యూటీ తమన్నా తనకు నచ్చిన వస్త్రధారణ గురించి చెప్పింది. ఎప్పుడూ క్యాజువల్‌గా ఉండడానికి ఇష్టపడతానని తెలిపింది. తాజాగా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న ఈ నటి వయ్యారంగా ర్యాంప్‌ వాక్‌ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో తమన్నా మాట్లాడుతూ.. తనకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను మాత్రమే ధరిస్తానని తెలిపింది. ‘‘నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. దాని కోసం ఎక్కువ కాస్మోటిక్స్‌ ఉపయోగించను. ఎప్పుడూ సహజంగా ఉండేలా చూస్తాను. అందుకే ఉల్లిపాయ రసాన్ని వాడతాను’’ అని తన బ్యూటీ సీక్రెట్‌ చెప్పింది. ఇక గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు తరచూ వార్తల్లో ఉంటోన్న విషయం తెలిసిందే. నటుడు విజయ్‌ వర్మతో రిలేషన్‌లో ఉందనే వార్త కొన్ని రోజులుగా వైరలవుతుంది. దీనిపై తాజాగా ఈ భామ మీడియాకు కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది. ‘‘మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం. అప్పటి నుంచి మాపై రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారు. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని వెల్లడించింది

ఇక తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే తమన్నా ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తోంది. చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్‌’ (Bhola Shankar)లో ఆడిపాడనుంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ‘జైలర్‌’ (Jailer)లో సందడి చేయనుంది. వీటితోపాటు ‘అరణ్మయై4’, ‘బోలేచుడియన్‌’ (Bole Chudiyan),‘భంద్రా’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని