Bangarraju:తస్సాదియ్యా... అదిరిందయ్యా

‘వాసివాడి తస్సాదియ్యా... పిల్ల జోరూ అదిరిందయ్యా’ అంటూ పార్టీ సాంగ్‌తో సందడి చేస్తున్నాడు బంగార్రాజు. ఆ హంగామాని ఆస్వాదించాలంటే  ‘బంగార్రాజు’ విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

Updated : 20 Dec 2021 07:56 IST

‘వాసివాడి తస్సాదియ్యా... పిల్ల జోరూ అదిరిందయ్యా’ అంటూ పార్టీ సాంగ్‌తో సందడి చేస్తున్నాడు బంగార్రాజు. ఆ హంగామాని ఆస్వాదించాలంటే  ‘బంగార్రాజు’ విడుదల వరకు ఎదురు చూడాల్సిందే. నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా...’ పాటని ఆదివారం విడుదల చేశారు. నాగార్జున, నాగచైతన్య, ఫరియా అబ్దుల్లా కలిసి ఆడిపాడే గీతమిది. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ రచించగా... మోహన భోగరాజు, సాహితి చాగంటి, దివ్య మాలిక, హర్ష వర్ధన్‌ చావలి, అనూప్‌ రూబెన్స్‌, వినాయక్‌ ఆలపించారు. శేఖర్‌ నృత్య దర్శకత్వం వహించారు. ‘‘అక్కినేని అభిమానులకి చిరకాలం గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాగార్జున, నాగచైతన్య కలిసి ఇందులో నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కథకి ముందు భాగంగా ఈ సినిమా రూపొందుతోంది. సంగీత ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే ఊపందుకున్నాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. చలపతిరావు, రావు రమేష్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, ఛాయాగ్రహణం: యువరాజ్‌, కళ: బ్రహ్మ కడలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని