Bigg Boss Telugu 5: చెంప పగలకొడతానని ఎన్ని సార్లు అంటావ్‌ ప్రియ: నాగార్జున

‘చెంప పగలకొడతాను.. చెంప పగలకొడతానని ఎన్ని స్లార్లు అంటావ్‌’ అని ప్రియని ప్రశ్నించారు . ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమంలో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

Updated : 23 Oct 2021 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చెంప పగలకొడతాను.. చెంప పగలకొడతానని ఎన్ని స్లార్లు అంటావ్‌’ అని ప్రియని ప్రశ్నించారు నాగార్జున. ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. శని, ఆదివారాల్లో ఆయన హౌజ్‌మేట్స్‌తో మాట్లాడుతూ సందడి చేస్తుంటారు. ఎప్పటిలానే ఈవారం ఆయన తన టైమింగ్‌తో అలరించారు. ఈ రోజు ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఈ విశేషాల్ని అందించింది. ‘గేమ్‌ బ్రహ్మాండంగా ఆడుతున్నావ్‌. సిరి దగ్గర స్టిక్కర్లు దొంగతనం చేశావ్‌?’ అంటూ రవిని నాగార్జున ఆటపట్టించారు. ఆ తర్వాత ప్రియతో మాట్లాడారు. ‘చెంప పగలకొడతాను.. చెంప పగలకొడతాను.. చెంప పగలకొడతానని ఎన్నిసార్లు అంటావ్‌. ఎందుకు అలా అన్నావ్‌’ అని ప్రియని అడిగారు. ‘మాట వరకూ ఒకే. కానీ, పక్కనున్న తొట్టెను తీసుకుని సన్నీపై కోపం ప్రదర్శించావ్‌’ అనగానే నేను అది చూడలేదు సర్‌ అని సన్నీ సమాధానమిచ్చాడు. ‘చూసినా ఏం చేస్తావులే’ అంటూ నాగార్జున నవ్వులు పూయించారు. యానీ మాస్టర్‌ తను ఎదుర్కొంటున్న సమస్యని నాగార్జునకి వివరించారు. ఈ హంగామా చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని