
Bigg Boss Telugu 5: అలాంటి రిలేషన్‌షిప్స్ నాకొద్దు: యానీ మాస్టర్
ఇంటర్నెట్ డెస్క్: ‘గత టాస్క్‌లో స్నేహితుడ్ని కోల్పోయాను, ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయాను. ఇలాంటి రిలేషన్స్ నాకొద్దు’ అంటూ యానీ మాస్టర్ భావోద్వేగానికి గురైంది. ‘బిగ్‌బాస్’ షోలో ఒకరైన శ్రీరామచంద్రపై ఇలా ఫైర్ అయింది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కార్యక్రమం ఇది. ఈ రోజు ప్రసారంకానున్న ఎపిసోడ్‌లోని విశేషాల్ని ప్రోమో అందించింది. ఇంటి సభ్యులు కొన్ని టీమ్‌లుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ అనే గేమ్‌లో భాగంగా గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతకి బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. వేరే టీమ్ బొమ్మల్ని సొంతం చేసుకోవడమే ఈ స్పెషల్ పవర్. తర్వాత హౌస్‌మేట్స్ నిర్ణయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. గేమ్ మొదలవుతుంది.. ఒకరికొకరు పోటీ పడి ఆడారు. మధ్యలో మాటల యుద్ధం జరిగింది. శ్వేత- యానీ మాస్టర్, శ్రీరామచంద్ర- యానీ మాస్టర్ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ‘లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్ పోయాడు, ఈ టాస్క్‌లో బిడ్డ పోయింది. అలాంటి రిలేషన్స్‌షిప్స్ నాకొద్దు’ అని శ్రీరామచంద్రపై యానీ మాస్టర్ ఫైర్ అయింది.