Sridevi Soda Center: అలరిస్తోన్న ‘చుక్కల మేళం దిక్కుల తాళం’ గీతం

సుధీర్‌ బాబు కథానాయకుడిగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఆనంది కథానాయిక. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాని ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ మెలొడీని విడుదల చేసింది చిత్ర బృందం.

Published : 17 Aug 2021 12:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుధీర్‌ బాబు కథానాయకుడిగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఆనంది కథానాయిక. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాని ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ మెలొడీని విడుదల చేసింది చిత్ర బృందం. ‘చుక్కల మేళం దిక్కుల తాళం’ అంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. సుధీర్‌- ఆనంది జోడీ కనువిందు చేస్తోంది. ఇద్దరి హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి నేపథ్యంలో రూపొందించిన ఈ పాటని అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో సూరిబాబుగా కనిపించనున్నారు సుధీర్‌. శ్రీదేవిగా ఆనంది సందడి చేయనుంది. నరేశ్‌, రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేశ్‌, హర్షవర్ధన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని