DJ Tillu: డిల్లా డిల్లా ఆడాలా

టిల్లు అన్న దిగిండంటే డించక్‌ డించక్‌ దుంకాలా... అంటూ తీన్‌మార్‌ సందడి మొదలు పెట్టాడు టిల్లు. అతని కథేమిటో తెలియాలంటే ‘డీజే టిల్లు’ చూడాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన చిత్రమిది.

Updated : 07 Dec 2022 17:44 IST

టిల్లు అన్న దిగిండంటే డించక్‌ డించక్‌ దుంకాలా... అంటూ తీన్‌మార్‌ సందడి మొదలు పెట్టాడు టిల్లు. అతని కథేమిటో తెలియాలంటే ‘డీజే టిల్లు’ చూడాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నేహాశెట్టి కథానాయిక. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘లాలాగూడా అంబర్‌పేట మల్లేపల్లి మలక్‌పేట... టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాలా...’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ గీతానికి రామ్‌ మిరియాల స్వరాలు సమకూర్చడంతోపాటు ఆయనే ఆలపించారు. ఈ పాట గురించి గీత రచయిత కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ ‘‘పక్కా హైదరాబాదీ రిథమ్‌తో కూడిన ఈ బాణీ వినగానే బాగా నచ్చింది. హైదరాబాద్‌ గల్లీల్లో ఒక రకమైన నడవడికతో కనిపించే కుర్రాళ్లని గుర్తు చేసుకుని ఈ పాట రాశా’’ అన్నారు. భాను నృత్య రీతులు సమకూర్చారు. కొత్తతరం రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు విమల్‌కృష్ణ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని