Dulquer Salmaan: ఉత్కంఠభరితంగా ‘కురుప్‌’ ట్రైలర్‌.. కట్టిపడేస్తోన్న దుల్కర్‌ నటన

‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ఈ క్రేజ్‌తోనే తను హీరోగా నటించిన మలయాళీ చిత్రాల్ని తెలుగులోనూ విడుదలచేస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఆయన నటించిన ‘కురుప్‌’ సినిమా నవంబరు 12న విడుదలకానుంది.

Updated : 03 Nov 2021 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ఈ క్రేజ్‌తోనే తను హీరోగా నటించిన మలయాళ చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఆయన నటించిన ‘కురుప్‌’ నవంబరు 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ట్రైలర్‌ని విడుదలచేసింది. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్‌ జీవితాధారంగా తెరకెక్కుతోంది. కురుప్‌, గోపీకృష్ణన్‌ అనే రెండు విభిన్న కోణాల్లో దుల్కర్‌ కనిపించారు. తన నటనతో అందరికీ కట్టిపడేసేలా ఉన్నారు. క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు కురుప్‌ వేసే ప్లాన్లతో ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నేపథ్య సంగీతం ప్రధానబలంగా నిలిచింది.

మరి గోపీకృష్ణన్‌.. కురుప్‌గా ఎందుకు మారాడు? పరిస్థితుల ప్రభావమా? పోలీసులు ఆయన్ను పట్టుకున్నారా? అసలు సుకుమార కురుప్‌ జీవితం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేన్‌ కీలక పాత్రలు పోషించారు. సంగీతం: సుషిన్‌ శ్యామ్‌, ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి. ఈ సినిమా మలయాళం, తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని