Bigg Boss Telugu 5: నీకు బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ తెలుసు.. ‘ఛల్‌ బే ఛల్‌ అనకు’ బాగుండదు

అనీమాస్టర్‌ ఎలిమినేట్‌ కావడంతో ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల....

Updated : 22 Nov 2021 18:52 IST

హైదరాబాద్‌: అనీ మాస్టర్‌ ఎలిమినేట్‌ కావడంతో ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల మధ్య ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులందరికీ బిగ్‌బాస్‌ మట్టి కుండలు ఇచ్చాడు. హౌస్‌లో కొనసాగే అర్హత ఏ కంటెస్టెంట్‌కి లేదని భావిస్తారో ఆ వ్యక్తి వద్ద కుండను పగలకొట్టి సరైన కారణంతో నామినేట్‌ చేయాలని బిగ్‌బాస్‌ అందరికీ సూచించాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టం లేని ఇంటిసభ్యుల్ని నామినేట్‌ చేయడానికి వచ్చిన శ్రీరామ్‌ ఆగ్రహానికి లోనయ్యాడు. అనీ మాస్టర్‌ ఎలిమినేషన్‌పై కాజల్‌, సన్నీలతో వాగ్వాదానికి దిగాడు. కాజల్‌ ఆడిన ఆట తీరు బాలేదని.. సన్నీని సేవ్‌ చేయడం కోసం ఆమె చేసిన పనుల వల్ల అనీ మాస్టర్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారంటూ శ్రీరామ్‌ కేకలు వేశాడు.

‘‘ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌. అందరూ ఒక్కరిని సేవ్‌ చేయాలని ఆడారు. నువ్వు మాత్రం ఇద్దర్ని అణచివేయాలని ఆడటం నాకు నచ్చలేదు’’ అంటూ శ్రీరామ్‌.. కాజల్‌తో చెప్పగానే.. ‘‘నా గేమ్‌పై నాకు క్లారిటీ ఉంది. నా ఫ్రెండ్‌ని సేవ్‌ చేయాలనుకున్నాను. అందుకే అతను ఎవిక్షన్‌ పాస్‌ సొంతం చేసుకోవాలని భావించాను’’ అని సమాధానమిచ్చింది. ఆ మాటతో ఆగ్రహానికి లోనైన శ్రీరామ్‌.. ‘‘అంటే నీ ఫ్రెండ్‌ వెళ్లిపోతాడని నీకు భయమా?’’ అని సూటిగా ప్రశ్నించాడు. ఈ వ్యవహారంలో కాజల్‌కు సన్నీ సపోర్ట్‌ చేయడానికి ప్రయత్నించగా.. ‘‘నేను కాజల్‌తో మాట్లాడుతున్నా. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీతో మాట్లాడతా’’ అని శ్రీరామ్‌ గట్టిగా సమాధానమిచ్చి.. కాజల్‌, సన్నీలను తాను నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రవిని నామినేట్‌ చేస్తూ ‘ఈ హౌస్‌లో ఫేక్‌ పర్సన్‌వి’ అన్నాడు. శ్రీరామ్‌ గురించి మాట్లాడగా, ‘ఛల్‌ బే ఛల్‌’ అనడంతో అలా అనకు బాగుండదు అని సన్నీ హెచ్చరించాడు. దీంతో కెప్టెన్‌ అయిన మానస్‌ వారికి సర్ది చెప్పాడు. మరి, ఈ వారం నామినేషన్‌లో ఎవరు ఉంటారో తెలియాలంటే ఈరోజు జరగనున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని