Radhesyam: అప్‌డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కు చిన్న ఆలస్యం
‘బాహుబలి’, ‘సాహో’ వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
హైదరాబాద్: ‘బాహుబలి’, ‘సాహో’ వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూట్ ఆలస్యమైంది. ఈ క్రమంలోనే గురువారం ‘రాధేశ్యామ్’ షూట్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ చిత్రబృందం కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈమేరకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. కొద్దిగా ఆలస్యమైనా సరే.. సెలబ్రేషన్స్ మాత్రం పీక్స్‌లో ఉంటాయని అభిమానులు అనుకుంటున్నారు.
వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే లవర్‌బాయ్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే పూజాహెగ్డే ప్రేరణగా సందడి చేయనున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ‘రాధేశ్యామ్’ గ్లిమ్స్, బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ సినీప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు