Regina: వ్యంగ్యాస్త్రం ‘బ్రేకింగ్‌ న్యూస్‌’

వరుసగా సినిమాలు చేస్తూ... జోరు చూపిస్తోంది రెజీనా కసాండ్రా. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఆమెతో పాటు, సుబ్బరాజు, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా

Updated : 24 Nov 2021 07:53 IST

రుసగా సినిమాలు చేస్తూ... జోరు చూపిస్తోంది రెజీనా కసాండ్రా. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఆమెతో పాటు, సుబ్బరాజు, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అనే చిత్రం రూపొందుతోంది. సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘ప్రస్తుత కాలానికి తగ్గట్లు... సామాజిక వ్యంగ్య అస్త్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డిసెంబర్‌ మూడో వారం వరకూ హైదరాబాద్‌ పరిసరాల్లోనే చిత్రీకరణ సాగుతుంది’’ అని చిత్రబృందం తెలిపింది. రా ఎంటర్‌టైన్మెంట్స్‌, మ్యాంగో మాస్‌ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.రవి కథ మాటలు అందించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని