sekhar: చెప్పింది చేయడు.. చేసేది చెప్పడు

రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. బీరం సుధాకర్‌రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం

Updated : 26 Nov 2021 07:50 IST

రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. బీరం సుధాకర్‌రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అరకు బోసుగూడెం తోట బంగ్లాలో దంపతుల దారుణ హత్య నేపథ్యంలో ప్రచార చిత్రం మొదలైంది. ‘వాడు ఎపుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అనే సంభాషణలు అందులో వినిపిస్తాయి. రిజైన్‌ చేసిన పోలీస్‌ అధికారి శేఖర్‌గా రాజశేఖర్‌ కనిపించనున్నట్టు స్పష్టమవుతోంది. ఆయన ఆహార్యం ఇదివరకు సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంది. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్‌’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గురించి దర్శకురాలు జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘జనవరి 2022లో దీన్ని విడుదల చేస్తాం. తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన లభిస్తోంద’’ని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని