యాంకర్‌ సుమ సీరియస్‌ నోట్‌

కరోనా కారణంగా యావత్‌ ప్రపంచమే స్తంభించిపోయింది. ఇక ప్రస్తుతం మన దేశం అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. దాదాపు అన్ని రంగాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మునుపెన్నడూ చూడనంత నష్టంచిత్రసీమకు వాటిళ్లింది.

Published : 28 May 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఉద్ధృతితో యావత్‌ ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రస్తుతం మన దేశం అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌తో దాదాపు అన్ని రంగాలూ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మునుపెన్నడూ చూడనంత నష్టం చిత్రసీమకు వాటిళ్లింది. గతేడాది లాక్‌డౌన్‌ దెబ్బతో మూతబడ్డ థియేటర్లు అలా తెరుచుకున్నాయో.. లేదో.. మళ్లీ కరోనా విరుచుకుపడింది. దీంతో మళ్లీ థియేటర్లు మూయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సినీ కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కాగా.. పరిశ్రమ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ యాంకర్‌ సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉద్వేగభరితమైన పోస్టు చేశారు. మేకప్‌ కిట్లు బూజుపట్టిపోతున్నాయంటూ ఆమె మేకప్‌ వేసుకుంటూ ఆ వీడియోలో కనిపించింది.
‘వీడియోను సరదాగా చూడండి. నోట్‌ మాత్రం కాస్త సీరియస్‌గానే చదవండి. వినోద పరిశ్రమలో మేం శారీరకంగా పనిచేయాల్సి ఉంటుంది. అదే మా కడుపు నింపేది. అంటే నటీనటులు, వ్యాఖ్యాతలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, కెమెరామెన్, లైట్ మెన్, ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్, మేకప్, హెయిర్‌స్టైలిస్ట్, ఆర్ట్, ఫుడ్, ప్రొడక్షన్ ఇలా అన్నీ సెట్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారంతా ఇప్పుడు ఖాళీ ఉంటున్నారు. మళ్లీ పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల కుటుంబాలను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనూ మళ్లీ ఇండస్ట్రీ పనులు మొదలవుతాయని భావిస్తున్నా’ అని ఆమె రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని