Nayanthara: నయనతార ఫ్యాన్స్‌ ఆగ్రహం.. వెనక్కి తగ్గిన నటి మాళవిక

మలయాళీ నటి మాళవికా మోహనన్‌(Malavika Mohanan)పై కోలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanthara) అభిమానులు గుర్రుగా ఉన్నారు. సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

Updated : 13 Feb 2023 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మాస్టర్‌’(Master) బ్యూటీ మాళవికా మోహనన్‌(Malavika Mohanan)పై లేడీ సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను విమర్శిస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అభిమానుల తీరుతో నిరాశకు గురైన మాళవిక చేసేది లేక.. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..?

తన కొత్త చిత్రం ‘క్రిస్టి’ (Christy) ప్రమోషన్స్‌లో భాగంగా మాళవికా మోహనన్ (Malavika)‌ ఓ మలయాళీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు ‘లేడీ సూపర్‌స్టార్‌’ పిలుపంటే నచ్చదని, హీరోయిన్లను కూడా హీరోల మాదిరిగానే సూపర్‌స్టార్‌ అంటూ అభివర్ణించాలన్నారు. ఈ వ్యాఖ్యలపై నయనతార అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నయనతారను దృష్టిలో పెట్టుకునే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని భావించిన వాళ్లు.. మాళవికను విమర్శిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆమె తాజాగా వివరణ ఇచ్చారు.

‘‘నటీమణులందరినీ ఉద్దేశిస్తూ ఆ పదాన్ని ఉపయోగించి నా అభిప్రాయాన్ని బయటపెట్టాను. అంతేకానీ, కచ్చితంగా ఒక్క హీరోయిన్‌నే ఉద్దేశించి నేను మాట్లాడలేదు. నాకు నయనతార అంటే ఎంతో ఇష్టం. ఆమెను ఒక సీనియర్‌గా భావించి.. నటనపరంగా ప్రేరణ పొందుతాను. దయచేసి మీ అందరూ కాస్త శాంతించండి’’ అని క్లారిటీ ఇచ్చారు.

గతంలోనూ నయనతారను ఉద్దేశిస్తూ మాళవిక (Malavika Mohanan) పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఓ లేడీ సూపర్‌స్టార్‌ సినిమా చూశానని, అందులోని ఆస్పత్రి సీన్‌లో ఆమె ఫుల్‌ మేకప్‌తో ఉందని.. ఆ సీన్స్‌ చూసి షాక్‌ అయ్యానని చెప్పారు. ఇదే ఇంటర్వ్యూ గురించి ఇటీవల నయనతార (Nayanthara) స్పందిస్తూ.. ‘‘దర్శకుడు చెప్పిందే నేను చేశాను. కమర్షియల్‌ సినిమాకి, వాస్తవిక సినిమాకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్స్‌.. ఏ సీన్‌లోనైనా కాస్త గ్లామర్‌గానే ఉంటారు. వాస్తవిక చిత్రాలకు వచ్చేసరికి.. సీన్‌కు అనుగుణంగా వాళ్లు అన్ని విధాలుగా మారాల్సి ఉంటుంది. అది కొంత మంది తెలుసుకోవాలి’’ అని కౌంటర్‌ ఇచ్చారు. ఆ గొడవ సద్దుమణిగిందనుకునేలోపే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు