Unstoppable: రాజమౌళి.. నాతో సినిమా ఎప్పుడు చేస్తారు: బాలకృష్ణ

‘‘ఇప్పటివరకూ మన కాంబినేషన్‌ పడలేదు. నా అభిమానులు మిమ్మల్ని ‘బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు’ అని అడిగారు.

Published : 16 Dec 2021 01:14 IST

హైదరాబాద్‌: ‘‘ఇప్పటివరకూ మన కాంబినేషన్‌ పడలేదు. నా అభిమానులు మిమ్మల్ని ‘బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు’ అని అడిగారు. మీ సమాధానం ఏంటి’’ అని అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి(Rajamouli)ని ప్రశ్నించారు నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna). ఆయన వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే(Unstoppable With NBK). తాజాగా షోకు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో రాజమౌళిని బాలకృష్ణ(Balakrishna) పలు ప్రశ్నలు అడిగారు. ‘మీరు ఇంటెలిజెంట్‌ అని, అఛీవర్‌ అని తెలుసు. ఇంకా ఎందుకు ఆ గడ్డం’, ‘మీతో సినిమా చేస్తే.. హీరోకు, ఇండస్ట్రీకి హిట్‌ ఇస్తారు. ఆ తర్వాత ఆ హీరోల రెండు, మూడు సినిమాలు ఫసక్‌యేగా’ అని ప్రశ్నించగా, రాజమౌళి కేవలం హావభావాలు మాత్రమే పలికించారు. ‘సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి’ అని అడగ్గా, ‘మీకూ తెలుసు, నాకూ తెలుసు ఇది ప్రోమోఅని, సమాధానాలు ఎపిసోడ్‌లో చెబుతా’ అని రాజమౌళి(Rajamouli) చెప్పటం నవ్వులు పూయిస్తోంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని