Upasana: రామ్‌చరణ్‌పై రివెంజ్‌ తీర్చుకున్న ఉపాసన.. వీడియో షేర్‌ చేసిన నటుడి సతీమణి

సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు రామ్‌చరణ్‌(Ram Charan) సతీమణి ఉపాసన (Upasana). తన కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర ఫొటోలు, వీడియోలను ఆమె తరచూ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ సరదా వీడియో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

Updated : 12 Feb 2023 12:17 IST

హైదరాబాద్‌: నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan)పై ఆయన సతీమణి ఉపాసన (Upasana) రివెంజ్‌ తీర్చుకున్నారు. ఓ ఈవెంట్‌లో తన సీటును ఆక్రమించినందుకు ఒకింత అసహనానికి గురైన ఆమె.. ఇంటికి వెళ్లాక ఆయనతో సేవలు చేయించుకున్నారు. అయితే, ఇదంతా నిజమే అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే.. ఇది నిజంగా జరగలేదు. కేవలం టెక్నాలజీతోనే ఇది సాధ్యమైంది. అదెలా అనుకుంటున్నారా..?

సుమారు నాలుగు నెలల క్రితం అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్ (RamCharan)‌, ఉపాసన (Upasana), సాయిధరమ్‌ తేజ్ (Saidharam Tej)‌.. స్టేజ్‌ వద్ద ఓకే సోఫాలో కూర్చొన్నారు. సోఫా కాస్త ఇరుకుగా అనిపించడంతో ఉపాసనను చరణ్‌  వేరే సీటులోకి పంపించారు‌. ఆమెను ఆట పట్టించినందుకు వాళ్లిద్దరూ సరదాగా నవ్వుకున్నారు. ఈ వీడియో అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే, ఈ సీన్‌ తర్వాత చరణ్‌ ఇంటికి వెళ్లాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో సరదాగా చెప్పాలనుకున్నాడు ఓ నెటిజన్‌. అందుకు అనుగుణంగా ఈ వీడియోకు లాక్‌డౌన్‌ సమయంలో చరణ్‌ ఇంటి పనులు చేసిన ఓ వీడియోను అటాచ్‌ చేసి ‘‘ఉపాసన మేడమ్‌ రివెంజ్‌’’ అని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. అది కాస్త ఉపాసన కంట పడింది. దీనిని చూసి ఫుల్‌గా నవ్వుకున్న ఆమె ఇన్‌స్టా స్టోరీల్లో దాన్ని షేర్‌ చేస్తూ స్మైలీ ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని