యానిమల్‌ సీక్వెల్‌లో విక్కీకౌశల్‌ ఆ పాత్ర కోసమేనా?

యానిమల్‌ పార్క్‌లో ప్రతినాయకుడి పాత్ర కోసం నటుడు విక్కీకౌశల్‌ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Published : 29 Feb 2024 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌ హిట్ చిత్రం యానిమల్‌(Animal). ఇందులో బాబీదేవోల్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా సీక్వెల్‌లో ఆయన స్థానంలో బాలీవుడ్‌ నటుడు విక్కీకౌశల్‌ (Vicky Kashual) పేరును మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తులు వినిపిస్తున్నాయి. వీటిపై ఇంకా అధికారిక ప్రటన విడుదల కాలేదు. మరోవైపు వీరిద్దరూ మల్టీస్టార్‌ ప్రేమకథ ‘లవ్‌ అండ్‌ వార్‌’లో కలిసి నటించనున్నారు. ఆ చిత్రాన్ని బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించనున్నారు. ఇందులో అలియాభట్‌ కథానాయిక.

ఓ ఇంటర్వ్యూలో సందీప్‌ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ..‘‘ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన సినిమా కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యం.  ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌వీర్‌ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘యానిమల్‌ పార్క్‌’ అధికారిక ప్రకటన తర్వాత టీ సిరీస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ‘‘ సందీప్‌ రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్‌లు సీక్వెల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. స్వేచ్ఛ, సృజనాత్మకతతో సినిమాను తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం సందీప్‌ ప్రభాస్‌ హీరోగా ‘స్పిరిట్‌’ రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత ‘యానిమల్‌ పార్క్‌’ సెట్స్‌ పైకి తీసుకెళ్తారు’’ అని టీ సిరీస్‌ నిర్మాణసంస్థ పేర్కొంది.

విక్కీకౌశల్‌ ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఛావా’ చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక కథానాయిక. దీనికి లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని