vijay devarakonda: చెప్పీ చెప్పనట్టుగా.. ఎంత చెప్పిందో

సినిమా పాటంటే అంతే. చెప్పీ చెప్పనట్టుగానే సినిమా కథనెంతో చెబుతుంటుంది. ‘ఫ్యామిలీస్టార్‌’ తొలి పాట కూడా నాయకానాయికల ప్రేమాయణం గురించి చాలానే చెప్పింది. ఏం చెప్పిందో తెలియాలంటే మాత్రం ‘నందనందనా... ’ పాటని వినేయాల్సిందే మరి!

Updated : 08 Feb 2024 09:51 IST

సినిమా పాటంటే అంతే. చెప్పీ చెప్పనట్టుగానే సినిమా కథనెంతో చెబుతుంటుంది. ‘ఫ్యామిలీస్టార్‌’ తొలి పాట కూడా నాయకానాయికల ప్రేమాయణం గురించి చాలానే చెప్పింది. ఏం చెప్పిందో తెలియాలంటే మాత్రం ‘నందనందనా... ’ పాటని వినేయాల్సిందే మరి! బుధవారం ఈ పాటని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో... సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చీ గిచ్చకా... ప్రాణాన్ని గుచ్చీ గుచ్చకా... చిత్రంగా చెక్కింది దేనికో...’ అంటూ సాగే ఈ పాటని అనంతశ్రీరామ్‌ రచించగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. గోపీసుందర్‌ స్వరకర్త. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘ఫ్యామిలీస్టార్‌’లో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్‌  దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ‘‘నాయకానాయికలపై చిత్రీకరించిన ‘నందనందనా...’ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విజయ్‌, మృణాల్‌ ఠాకూర్‌ జోడీ తెరపై చూడముచ్చటగా కనిపిస్తుంది. విడుదల కాగానే పాటకి విశేష ఆదరణ లభిస్తోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.యు.మోహనన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని