Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండతో మీటింగ్‌.. అభిమాని భావోద్వేగం

మనలో చాలామంది తామెంతగానో అభిమానించే నటులను దగ్గర నుంచి చూసినా, వారిని కలిసినా భావోద్వేగానికి లోనవుతారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేక ఆనంద భాష్పాల రూపంలో తెలియజేస్తారు.

Published : 01 Jul 2022 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనలో చాలామంది తామెంతగానో అభిమానించే నటులను దగ్గర నుంచి చూసినా, వారిని కలిసినా భావోద్వేగానికి లోనవుతారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేక ఆనందభాష్పాల రూపంలో తెలియజేస్తారు. తాజాగా, విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అభిమాని ఇలాంటి భావోద్వేగానికే గురయ్యారు. తాను ఆరాధించే నటుడ్ని కలుసుకోవడం, ఆయనతో మాట్లాడిన ఆనందాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చెర్రీ అనే ఈ వీరాభిమానితోపాటు సోనాలి అనే మరో అభిమాని విజయ్‌ను కలిశారు. వీరితో సరదాగా ముచ్చటించి, కలిసి ఫొటోలు దిగారు విజయ్‌ దేవరకొండ. అదే చోట ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటి, నిర్మాత ఛార్మిని వారికి పరిచయం చేశారు. చెర్రీ.. విజయ్‌ దేవరకొండ టాటూతో తన అభిమానాన్ని చాటుకున్నారు.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించిన ‘లైగర్‌’ (Liger) చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో అనన్య పాండే కథానాయిక. ఇది విడుదలవకముందే పూరీ- విజయ్‌ ‘జేబీఎం’ (JGM) అనే మరో పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని