Vijay devarakonda: విజయ్‌దేవరకొండపై అసభ్యకర వీడియో.. యూట్యూబర్‌ అరెస్ట్‌..

సినీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)పై ఓ వ్యక్తి తప్పుడు వీడియోలు ప్రచారం చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Updated : 14 Dec 2023 10:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఖుషి’ సినిమాతో హిట్‌ను సొంతం చేసుకున్నారు విజయ్‌ దేవరకొండ  (Vijay Deverakonda). ఆయనకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నిజజీవితంలోనూ విజయ్ హీరో అనిపించుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. తాజాగా ఈ యంగ్‌ హీరోపై ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో అసభ్యకర వీడియోను అప్‌లోడ్‌ చేశారు. విజయ్‌ టీమ్‌ దీనిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా.. సదరు యూట్యూబర్‌ను అరెస్ట్‌ చేశారు.

అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి విజయ్‌ దేవరకొండని కించపరిచే విధంగా వీడియోలు క్రియేట్‌ చేసి తన యూట్యూబ్‌ ఛానల్లో అప్‌లోడ్‌ చేశాడు. విజయ్‌తో పాటు మరో నటిని కూడా ఆ వీడియోల్లో అసభ్యకరంగా చూపించాడు. అవి వైరల్‌ కావడంతో విజయ్‌ టీమ్‌ సదరు యూట్యూబ్‌ ఛానల్‌పై ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు యూట్యూబర్‌ను అరెస్ట్‌ చేసి అతడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఆ వీడియోలను డిలీట్‌ చేయించారు. మరోసారి అవాస్తవాలను, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లోకేశ్‌ కనగరాజ్‌ షార్ట్‌ఫిల్మ్‌.. ‘ఖైదీ’ ప్రీక్వెల్‌..!

ఇక ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’(Family Star)తో బిజీగా ఉన్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. అందులోని ‘ఐరనే వంచాలాఏంటి!’ అనే డైలాగ్‌ వైరల్‌గా మారి ట్రెండ్‌ను సృష్టించింది. ఇక దీనితో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం (VD 12)లో విజయ్‌ నటిస్తున్నారు. ఇది కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని