Vijay Deverakonda: కన్నీళ్లు ఆగట్లేదు.. ‘ఖుషి’ విడుదలపై విజయ్ దేవరకొండ ఎమోషనల్‌ ట్వీట్‌

విజయ్‌ దేవరకొండ-సమంత నటించిన ‘ఖుషి’ (kushi) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ ఓ ఎమోషనల్ ట్వీట్‌ చేశారు. 

Published : 01 Sep 2023 12:03 IST

హైదరాబాద్‌: హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులు ‘ఖుషి’ (kushi) కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. ఆయన కూడా అంతే ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ యంగ్‌ హీరో ఖాతాలో సరైన హిట్‌ చేరలేదు. దీంతో తన ఆశలన్నీ ‘ఖుషి’పైనే పెట్టుకున్నాడు విజయ్‌. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఆయన ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం అది వైరలవుతోంది.

‘‘నా విజయం కోసం మీరంతా నాతో పాటు 5 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. నేను మంచి సినిమా ఇస్తానని ఓపిగ్గా ఉన్నారు. ఈరోజు ‘ఖుషి’తో మేం సాధించాం. నా చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంతో నన్ను నిద్రలేపారు. కొన్ని వందల మెసేజ్‌లు, ఫోన్‌లు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా. మీ కుటుంబంతో వెళ్లి సినిమాను ఎంజాయ్‌ చేయండి. మీరంతా ‘ఖుషి’ని ఆదరిస్తారని నాకు తెలుసు. లవ్యూ’’ అని రాశారు. దీనికి ఎమోషనల్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా విజయ్‌ దేవరకొండ జోడించారు. 

14 భాషల్లో అనుష్క సినిమా.. హీరో ఎవరంటే?

ఇక ‘ఖుషి’ విడుదలకు కొన్ని గంటల ముందు కూడా విజయ్‌ దేవరకొండ ఓ ప్రత్యేక వీడియో పోస్ట్‌ చేశారు. ‘అప్పుడే ఈ చిత్రం విడుదల దాకా వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. మీరంతా నన్ను వెండితెరపై చూసి ఏడాది అవుతోంది. మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చూడడం కోసం నేనెంతగా ఎదురుచూస్తున్నానో మాటల్లో చెప్పలేను’ అని అన్నారు.  ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ సరసన సమంత (Samantha) నటించారు. ప్రస్తుతం వీరి అభిమానులంతా థియేటర్లలో సందడి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని