Anushka Shetty: 14 భాషల్లో అనుష్క సినిమా.. హీరో ఎవరంటే?

అనుష్క (Anushka Shetty) తొలిసారి ఓ మలయాళం సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ చిత్రం 14 భాషల్లో విడుదల కానుంది.

Published : 01 Sep 2023 10:34 IST

హైదరాబాద్‌: హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) మరో పాన్‌ ఇండియా సినిమాలో నటించనున్నారు. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల చేశారు.

‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’ (Kathanar - the wild sorcerer) పేరుతో రానున్న ఓ హారర్‌ సినిమాకు అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో జయసూర్య (Jayasurya) హీరోగా నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర అరుంధతి తరహాలో ఉంటుందని సమాచారం. రోజిన్ థామస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా మొత్తం 14 భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుండడం విశేషం. తన 18 ఏళ్ల కెరీర్‌లో అనుష్క ఇప్పటి వరకు తమిళ, తెలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. మొదటిసారి మలయాళ చిత్రంలో నటించడం అదీ ఈ స్థాయి సినిమా కావడంలో బాక్సాఫీస్ వద్ద  హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఈ విజువల్‌ గురించి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా: విజయ్‌ దేవరకొండ

ఇక ప్రస్తుతం అనుష్క  ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించారు. ఆయన స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో కనిపిస్తుండగా.. అనుష్క చెఫ్‌గా నటించారు. చిత్రబృందమంతా దీని ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని