GOAT:రయ్‌రయ్‌.. విజయ్‌

విజయ్‌ కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated : 08 Jan 2024 09:25 IST

విజయ్‌ కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రభుదేవా, స్నేహా, లైలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత చకచకా కొత్త షెడ్యూల్స్‌ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసుకుంటోంది. మరికొన్ని రోజుల్లో చెన్నై షెడ్యూల్‌ పూర్తి కానుండగా.. ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో.. ఆ వెంటనే ఫిబ్రవరి నుంచి రాజస్థాన్‌లో వరుస షెడ్యూల్స్‌ పూర్తి చేయనున్నారు. దీనిలో భాగంగా పోరాట ఘట్టాలతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఈ రెండూ పూర్తయ్యాక యూనిట్‌ ఇస్తాంబుల్‌కు పయనం కానుంది. మార్చి చివరి నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. గ్రాఫిక్స్‌ హంగులతో కూడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో విజయ్‌ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, ఛాయాగ్రహణం: సిద్ధార్థ నుని.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని