Mahesh Babu: అందుకే మహేశ్ హీరోగా రాజమౌళి ఆ సినిమా చేస్తున్నారు: విజయేంద్ర ప్రసాద్
తాజాగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేశ్‌పై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి కథకు మహేశ్ సరైనా ఎంపిక అన్నారు.
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల ‘సర్కారువారి పాట’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్, అడ్వెంచర్ కథలో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా అప్‌డేట్‌ల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆయన మహేశ్‌ను ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేశ్ లాంటి నటుడికి కథ రాయాలని చాలా మంది రచయితలు అనుకుంటారని ప్రశంసించారు.
‘‘మహేశ్‌బాబు ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్. అతను నటించిన యాక్షన్ సన్నివేశాలు చూస్తే చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి రాజమౌళి ఇలాంటి సాహసోపేతమైన కథను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఈ కథకు మహేశ్ సరిగ్గా సరిపోతాడని అతనిని ఎంపిక చేసుకున్నాడు. నేను తనని దృష్టిలో పెట్టుకొని కథ రాశాను. ఈ చిత్ర షూటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రదేశాల్లో చిత్రీకరించాలని అనుకుంటున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Team India: అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి.. వారికీ సమయం ఇవ్వండి: అశ్విన్
-
World News
Pakistan: మసీదులో పేలుడు ఘటనలో 44కి చేరిన మృతులు.. ఇది తమ పనేనని ప్రకటించిన టీటీపీ!
-
Politics News
Andhra news: ప్రజల దృష్టిని మరల్చేందుకే నాపై విచారణ : చింతకాయల విజయ్
-
General News
TSPSC: ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన