Vikram: మన సంస్కృతిని చూసి మనమంతా గర్వపడాలి: విక్రమ్‌

ఓ నవల ఆధారంగా మణిరత్నం  తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్’‌. చౌళరాజుల నేపథ్యంలో ఉండే ఈ చిత్రం మొదటిభాగం సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్‌ ఈవెంట్‌లో హీరో విక్రమ్‌ చేసిన వ్యాఖ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Published : 26 Sep 2022 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ నవల ఆధారంగా మణిరత్నం  తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్’‌. చోళరాజుల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మొదటిభాగం సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్‌ ఈవెంట్‌లో హీరో విక్రమ్‌ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. ఇంతకి విక్రమ్‌ ఏం మాట్లాడాడంటే.. భారతదేశంలోని దేవాలయాల గొప్పతనాన్ని, చోళరాజులు సృష్టించిన అద్భుతాల గురించి వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

‘‘ఎవరో అన్నారు.. నిటారుగా ఉన్న భవన(ది లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా) నిర్మాణాన్ని అందరూ పొగడుతారని..కానీ మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వాటి నిర్మాణంలో కనీసం ప్లాస్టర్‌ని కూడా ఉపయోగించలేదు.  తంజావూర్‌ దేవాలయంపై ఎన్నో టన్నుల బరువున్న రాయి ఉంది. దానిని అక్కడ పెట్టడానికి ఎటువంటి క్రేన్‌లను ఉపయోగించలేదు. ఆరు కిలోమీటర్ల ర్యాంపును నిర్మించారు. దాని సహయంతో ఆ రాయిని పైన పెట్టారు. అది ఇప్పటికి ఆరు భూకంపాలను తట్టుకొని నిలిచింది’’ అని అన్నారు.

అలాగే చోళరాజు రాజరాజచౌహాన్ గొప్పతనం గురించి మాట్లాడారు.  ‘‘ఆయన తన పాలనలో 5000 డ్యామ్‌లు నిర్మించారు. ప్రజలకు రుణాలు ఇచ్చారు. ఉచితంగా వైద్యసదుపాయాలు కల్పించారు. పట్టణాలన్నింటికీ మహిళల పేర్లు పెట్టారు. ఒక్కసారి మన సంస్కృతి గురించి ఆలోచించండి. దానికి మనం గర్వపడాలి.  ఉత్తరభారతదేశం, దక్షిణ భారతదేశం అని ఏమీ లేదు. మనమంతా భారతీయులం’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని