Vikram MAHAAN Review: రివ్యూ: మహాన్
విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన మహాన్ ఎలా ఉందంటే..?
చిత్రం: మహాన్; నటీనటులు: విక్రమ్, ధ్రువ్ విక్రమ్, సిమ్రన్, బాబీ సింహా, వాణీ భోజన్, తదితరులు; సంగీతం: సంతోషన్ నారాయణన్; ఎడిటింగ్: వివేక్ హర్షన్; సినిమాటోగ్రఫీ: శ్రేయస్ కృష్ణ; కథ, కథనం, దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్; నిర్మాత: లలిత్‌కుమార్; నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియో; విడుదల తేదీ: 10-2-2021; స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్.
విభిన్నమైన కథలు, ఆకట్టుకునే నటనతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు నటుడు విక్రమ్. గత కొంతకాలం నుంచి సరైన విజయం కోసం ఎదురుచూస్తోన్న ఆయన ‘మహాన్’గా సక్సెస్ పొందేందుకు సిద్ధమయ్యారు. మద్యపాన నిషేధం అనే కథాంశంతో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రచార చిత్రాలు ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ చిత్రంలోనూ తండ్రీకొడుకులుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. మరి, అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుందా? ‘మహాన్’ ప్రేక్షకుల్ని మెప్పించాడా? తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే..!
కథేంటంటే: గాంధీమహాన్ (విక్రమ్) కామర్స్ లెక్చరర్. మహాన్ కుటుంబం తరతరాలుగా మద్యపాన నిషేధానికి పోరాటం చేసింది. అదే ఆదర్శాలతో మహాన్ పెరిగి పెద్దవాడవుతాడు. తన 40వ యేట ఇకపై తనకు నచ్చినట్టుగా బతకాలని అనుకుంటాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తాడు. ఈ విషయం అతని భార్య నాచికు(సిమ్రన్) తెలియడంతో వారి మధ్య గొడవలు వస్తాయి. దాంతో నాచి, కొడుకుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతుంది. మద్యానికి నెమ్మదిగా అలవాటు పడిన మహాన్.. కొద్ది కాలంలోనే ఏపీ మద్యం సిండికేట్‌కు లీడర్ అవుతాడు. ఈ క్రమంలోనే అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? దానివల్ల మహాన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? మహాన్(విక్రమ్), దాదాబాయ్ నౌరోజీ(ధ్రువ్ విక్రమ్)కు మధ్య ఎలాంటి సంఘర్షణలు ఎదురయ్యాయి? వీరి మధ్య నడిచే పోరాటంలో ఎవరు పైచేయి సాధించారు అనేది కథ.
ఎలా ఉందంటే: కథానాయకుడు సాధారణ జీవితం నుంచి ఒక సిండికేట్ నాయకుడు, మాఫియా నాయకుడిగా ఎదగడం ఆ క్రమంలో వివిధ సవాళ్లను ఎదుర్కొవడం.. తెలియకుండా రక్త సంబంధీకులతోనే పోరాటం చేయాల్సి రావడం, మనం చాలా సినిమాల్లో చూశాం. ‘మహాన్’ కూడా అలాంటిదే. రెండు బలమైన పాత్రల మధ్య సంఘర్షణలను ఎలా తీర్చిదిద్దారన్న దాని పైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అదీ తండ్రీకొడుకులు రెండు భిన్నమైన పాత్రల్లో ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఈ అంచనాలు అందుకోవడంలో కార్తిక్ సుబ్బరాజ్ కొంత మేరకే సఫలమయ్యాడు. గాంధేయవాదాలను పాటిస్తూ తరతరాలుగా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాన్ కుటుంబం, అదే సిద్ధాంతాలను పాటిస్తూ మహాన్ ఎదగడం తదితర అంశాలతో సినిమా ప్రారంభించాడు. ఎప్పుడైతే మహాన్ తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్నాడో అప్పుడే అసలు కథ మొదలవుతోంది. లిక్కర్ సిండికేట్‌కు నాయకుడిగా ఎదిగే క్రమంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని అలరిస్తాయి. అవన్నీ చకచకా సాగిపోతాయి. ఎప్పుడైతే దాదాబాయ్ నౌరోజీ అలియాస్ దాదా కథలోకి రంగప్రవేశం చేస్తాడో అప్పుడే కథపై మరింత ఆసక్తి ఏర్పడుతుంది. తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నా ఆ పాత్రలను మరింత ఆస్తకికరంగా మలిచి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. అలా కాకుండా కేవలం విక్రమ్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు కార్తిక్ సుబ్బరాజ్. ద్వితీయార్థంలో ఒకటి రెండు ట్విస్టులు మినహా.. సినిమా అంతా ఒకే టెంపోలో సాగుతుంది. ప్రతి సన్నివేశంలో కార్తిక్ సుబ్బరాజ్ మేకింగ్ స్టైల్ కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: నటన, ఎంచుకునే పాత్రలు విక్రమ్‌ను ఒక విలక్షణ నటుడిగా నిలబెట్టాయి. అయితే కొంతకాలంగా ఆయనకు ఏ సినిమాతోనూ సరైన విజయం లభించలేదు. ఇక తాజాగా వచ్చిన ‘మహాన్’ ఆయనకు సక్సెస్‌ని అందించడంలో కొంతమేరకు సఫలమైనట్టే. ఈ కథకు మహాన్ పాత్రలో విక్రమ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. న్యాయం చేశాడు అనడం కన్నా ఒదిగిపోయాడు అనడం సముచితం. తండ్రికి ధీటుగా ధ్రువ్ కూడా దాదా పాత్రలో చక్కని నటన కనబరిచాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయువుపట్టు. అవే అభిమానులను మెప్పిస్తాయి. విక్రమ్, ధ్రువ్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టేలా ఉన్నాయి. సిమ్రన్, బాబీ సింహా, తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ శ్రేయస్కృష్ణ కెమెరా పనితనం మెప్పించేలా ఉంది. సంతోష్ నారాయణ్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. ఎడిటర్ వివేక్ హర్షన్ తన కత్తెరకు మరికాస్త పనిచెప్పి ఉండాల్సింది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తనదైన శైలిలో ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను స్మార్ట్ స్క్రీన్‌ప్లేతో తీర్చిదిద్దాడు. అయితే, పూర్తిగా పాత్రల మధ్య బలమైన సంఘర్షణ తీసుకురావడంలో తడబడ్డాడు. ‘మహాన్’, దాదా పాత్రలను కేవలం అభిమానులను దృష్టిలో పెట్టుకునే తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది.
+ బలాలు
విక్రమ్, ధ్రువ్
నేపథ్య సంగీతం
ద్వితీయార్థం
- బలహీనతలు
నిడివి, బలమైన భావోద్వేగాలు లేకపోవడం
ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా: విక్రమ్-ధ్రువ్‌ల మెరుపుల ‘మహాన్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్