NTR: ఆ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా: ఎన్టీఆర్‌

రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది. దీంతో చిత్రబృందం హిందీ వర్షన్‌ కోసం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇటీవల ముంబయిలో ప్రి-రిలీజ్‌ వేడుకను ఘనంగా

Updated : 22 Dec 2021 11:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. హిందీ వెర్షన్‌ కోసం ఇటీవల ముంబయిలో ప్రి-రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ విలేకర్ల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ఈ క్రమంలో తన బాలీవుడ్‌ ఎంట్రీపై ఎన్టీఆర్‌ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

ఓ విలేకరి.. నేరుగా హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించగా.. తాను బాలీవుడ్‌ సినిమా అవకాశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని మరో నటుడు రామ్‌ చరణ్‌ ఎనిమిదేళ్ల కిందటే ‘జంజీర్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని