War 2: హృతిక్‌, ఎన్టీఆర్‌ల వార్‌ 2 అప్పుడే

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టీ ‘వార్‌ 2’పైనే ఉంది. తెలుగు, హిందీ భాషలకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు తెరపై కనిపిస్తే ఆ సందడి ఎలా ఉంటుందో ఈ చిత్రంతో చూపించబోతున్నారు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌.

Updated : 30 Nov 2023 06:35 IST

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టీ ‘వార్‌ 2’పైనే ఉంది. తెలుగు, హిందీ భాషలకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు తెరపై కనిపిస్తే ఆ సందడి ఎలా ఉంటుందో ఈ చిత్రంతో చూపించబోతున్నారు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ని అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘‘వార్‌ 2’ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ మధ్య ముఖాముఖి పోరాటాలు చూడడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ తీపి కబురుని అధికారికంగా వినిపించింది యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌. ఆదిత్య చోప్రా నిర్మాత. ఇందులో ఎన్టీఆర్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. ‘దేవర’ చిత్రీకరణతో బిజీగా ఉన్న ఆయన ‘వార్‌ 2’ కోసం సంక్రాంతి తర్వాత సెట్లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని