విజయ్‌వర్మలా ఉండాలనుకుంటున్నా: నాగార్జున
చేసిన పని, చేసిన సినిమాలే చేయడం ఇష్టం లేదని నాగార్జున అన్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున ప్రధానపాత్రలో ‘వైల్డ్ డాగ్’ తెరకెక్కిన విషయం తెలిసిందే. సయామీఖేర్, అలీ రెజా, ఆర్యా పండిట్, కాలెబ్ మాథ్యూస్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘వైల్డ్‌డాగ్’ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం విజయ్‌వర్మ పాత్ర. బయట కూడా అలాగే ఉండాలనుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. సయామీఖేర్, అలీ రెజా, ఆర్యా పండిట్, కాలెబ్ మాథ్యూస్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రిరిలీజ్ వేడుక ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ముందుగా నేషనల్ అవార్డు సాధించిన వంశీపైడిపల్లి, రాజు సుందరం, గౌతమ్, నవీన్‌కు అభినందనలు. మేమంతా గర్వపడేలా చేశారు. ఇక ‘వైల్డ్‌డాగ్’ గురించి చెప్పాలంటే.. డైరెక్టర్ అహిషోర్ సాల్మన్ చెప్పిన కథ నాకు నచ్చడానికి కారణం విజయ్‌వర్మ పాత్ర. అతను ప్రేమించిన దానికోసం ఏదైనా చేస్తాడు. అందుకే అమితంగా ప్రేమించే భారతదేశం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడతాడు. నాకు నిజ జీవితంలో కూడా ఆ పాత్రను అనుసరించాలని ఉంది. నేను తీసే సినిమాలు అలాగే ఉండాలని నా కోరిక. అందుకే నేను చేసే సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా ఉంటాయి. చేసిన పనే చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే చేసిన సినిమాలు మళ్లీ చేయడానికి ఇష్టపడను. ఈ సినిమా చేయడానికి కారణం కూడా అదే’’ అని ఆయన అన్నారు.
‘‘ఇక ఈ సినిమాలో అసలైన ‘వైల్డ్‌డాగ్’ నిర్మాత నిరంజన్‌రెడ్డి. డైరెక్టర్ సాల్మన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి ‘ఊపిరి’కి పనిచేశాం. ఆయనకు ఏదైనా తెలియకపోతే మొహమాటపడకుండా టెక్నీషియన్లను అడుగుతారు. ఈ సినిమాలో ఇంకో చిన్న వైల్డ్‌డాగ్ సినిమాటోగ్రాఫర్ షానైల్ డియో. సినిమాను చాలా ప్రేమతో తీశాం. ఇక ‘ఊపిరి’తో తమ్ముడైన కార్తీ సినిమా కూడా విడుదల కాబోతోంది. మా ఇద్దరి సినిమాలు ఒకేరోజు మీ ముందుకు వస్తున్నాయి. ఆ సినిమా కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏప్రిల్ 2న అందరూ థియేటర్లకు వెళ్లి ‘వైల్డ్‌డాగ్’ సినిమా చూస్తారని ఆశిస్తున్నా’’ అని నాగార్జున అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్‌తో అజిత్
కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ రిలీజైంది. -
విజయ్ ‘ది గోట్’.. అప్డేట్ షేర్ చేసిన దర్శకుడు
విజయ్ ‘ది గోట్’పై దర్శకుడు వెంకట్ ప్రభు అప్డేట్ ఇచ్చారు. -
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్. -
‘కన్నప్ప’లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన టీమ్
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరోయిన్ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ పోస్ట్ పెట్టింది. -
ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్‌ల ప్రాజెక్ట్‌కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్‌గా మలయాళ నటుడు
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్2: శౌర్యంగపర్వం’లో మరో మలయాళ నటుడు వచ్చి చేరారు. -
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
‘దేవర ముంగిట నువ్వెంత’: ఎన్టీఆర్ మూవీ సాంగ్‌పై నిర్మాత ఆసక్తికర ట్వీట్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా తొలి గీతంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
‘కల్కి’ సీజీ వర్క్‌పై నిర్మాత ఫన్నీ పోస్ట్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే!
‘కల్కి’ సీజీ వర్క్‌పై నిర్మాత ఫన్నీ పోస్ట్ పెట్టారు. -
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్‌గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్‌న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్‌తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు