Yashoda: ఓటీటీల్లానే థియేటర్లలోనూ.. నచ్చిన భాషలో ‘యశోద’ను చూడండిలా!
‘సినీడబ్స్’ యాప్‌లో ‘యశోద’ సౌండ్ ట్రాక్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రేక్షకులు నచ్చిన భాషలో సినిమా చూడొచ్చని టీమ్ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓటీటీలో సినిమా చూడాల్సి వస్తే మనకు వచ్చిన, నచ్చిన భాషను ఎంపిక చేసుకుని చూస్తాం. థియేటర్లలో అయితే ప్రదర్శితమైన భాషలోనే ఆయా చిత్రాలను చూడాలి. ఈ పరిస్థితికి చెక్ పెట్టింది ‘సినీడబ్స్’ అనే యాప్. దీనిద్వారా ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో థియేటర్‌లోనే సినిమా చూడొచ్చు. ‘‘ఈ టెక్నాలజీతో ‘యశోద’ (Yashoda) చిత్రాన్ని మీకు ఇష్టమైన భాషలో చూడండి’’ అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. నాలుగు భాషల్లో ఈ సినిమా ఆడియో అందుబాటులో ఉందని, వాటిల్లో ప్రేక్షకులు తమకు కావాల్సిన ఓ భాషను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. సమంత (Samantha) ప్రధాన పాత్రలో దర్శకులు హరి- హరీశ్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే.
యాప్ టు థియేటర్ విధానమిదీ..
* గూగుల్ ప్లే స్టోర్/ యాప్ స్టోర్ నుంచి ‘సినీడబ్స్’ (cinedubs) అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* లాగిన్ అయిన తర్వాత.. మీ దగ్గర్లో ఈ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్, ప్రదర్శన వేళల (మార్నింగ్ షో, మ్యాట్నీ తదితర)ను సెలెక్ట్ చేసుకోవాలి.
* థియేటర్‌కు వెళ్లాక.. సినిమాను మీరు ఏ భాషలో చూడాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ సౌండ్ ట్రాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* డౌన్‌లోడ్ అయిన ఆడియో ట్రాక్‌ను ప్లే చేయగానే అది ఆటోమేటిక్‌గా తెరపై దృశ్యాలకు సింక్ అవుతుంది. దీనికి హెడ్‌సెట్ తప్పనిసరి.
* ఈ యాప్‌లో ‘యశోద’కు సంబంధించి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఆడియో ట్రాక్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nellore: కోటంరెడ్డితోనే ప్రయాణం..ఆయనే మా ఊపిరి: నెల్లూరు మేయర్
-
India News
కేజ్రీవాల్ రాజీనామాకు భాజపా డిమాండ్.. ఆప్ కార్యాలయం ముందు ఆందోళన
-
India News
Bill Gates: రోటీ చేసిన బిల్‌గేట్స్.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
Sports News
IND vs AUS: టీమ్ఇండియా ‘తగ్గేదేలే’.. నెట్‌బౌలర్లుగా నలుగురు టాప్ స్పిన్నర్లు!
-
Movies News
vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత