అట్టహాసంగా జీ సినిమా అవార్డుల ప్రదానోత్సవం.. ‘నాటు నాటు’కు స్టేజ్‌పై అలియా స్టెప్పులు

బీటౌన్‌లో ప్రత్యేకంగా భావించే జీ సినిమా అవార్డుల ప్రదానోత్సం తాజాగా జరిగింది. ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ తారలు తళుక్కున మెరిశారు.

Updated : 27 Feb 2023 17:55 IST

ముంబయి: బాలీవుడ్‌(Bollywood)లో విశేషంగా భావించే ‘జీ సినిమా అవార్డుల’ (Zee Cine Awards 2023) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్‌ స్టార్‌ సెలబ్రిటీలు బోనీకపూర్‌, వివేక్‌ అగ్నిహోత్రి, అయాన్‌ ముఖర్జీ, అలియా భట్‌, కార్తిక్‌ ఆర్యన్‌, రష్మిక, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ‘ఆర్ఆర్‌ఆర్‌’(RRR)లోని ‘నాటు నాటు’ పాటకు అలియా భట్‌ అదరగొట్టేలా డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘డార్లింగ్స్‌’ చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా అలియాభట్‌(Alia Bhatt), ‘భూల్‌ భులైయా-2’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) అవార్డులు సొంతం చేసుకున్నారు.

విజేతలు వీరే..!

  • ఉత్తమ నటుడు: కార్తిక్‌ ఆర్యన్‌ (భూల్‌ భులైయా -2)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ చిత్రం (వీక్షకుల ఛాయిస్‌): ది కశ్మీర్‌ ఫైల్స్‌
  • ఉత్తమ సినిమా (జ్యూరీ) : డార్లింగ్స్‌
  • ఉత్తమ నటి (జ్యూరీ) :  అలియా భట్‌ (డార్లింగ్స్‌)
  • ఉత్తమ నటుడు (వీక్షకుల ఛాయిస్‌) : అనుపమ్‌ ఖేర్‌ (ది కశ్మీర్‌ ఫైల్స్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే : ది కశ్మీర్‌ ఫైల్స్‌
  • ఉత్తమ మ్యూజిక్‌ : ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర)
  • ఉత్తమ ఎడిటింగ్‌: సన్యుక్త (బేడియా)
  • ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ : సచిన్‌ - జిగార్‌ (బేడియా)
  • మోస్ట్‌ స్ట్రీమ్‌డ్‌ ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : సచిన్‌ - జిగార్‌ (బేడియా)
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ : కునాల్‌ శర్మ (బేడియా)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : బాస్కో-సీజర్ (భూల్‌ భులైయా -2)
  • పెర్ఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (నటుడు):  వరుణ్‌ ధావన్‌ (జుగ్‌ జుగ్‌ జియో)
  • పెర్ఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (నటి) : కియారా అడ్వాణీ (జుగ్‌ జుగ్‌ జియో)
  • ఉత్తమ నూతన నటి: రష్మిక (గుడ్‌ బై)
  • ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (జుగ్‌ జుగ్‌ జియో)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని