బోస్టన్‌లో మే 20-21 తేదీల్లో మ‌హానాడు వేడుక‌లు!

తెలుగుదేశం పార్టీ ఘ‌నంగా నిర్వహించుకునే పచ్చ పండగగా భాసిల్లిన మ‌హానాడును ఈ ఏడాది

Published : 14 May 2022 12:08 IST

ఏర్పాట్లను స్వయంగా సమీక్షించిన జయరాం కోమటి 

తెలుగుదేశం పార్టీ ఘ‌నంగా నిర్వహించుకునే పచ్చ పండగగా భాసిల్లిన మ‌హానాడును ఈ ఏడాది అమెరికాలోని ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా మే 27-29 తేదీల్లో ఘ‌నంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి పార్టీ పెద్ద పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ తీర్మానాలు, భవిష్యత్తు, పోరాటాలు, ఉద్యమాలు, కొత్త నేత‌ల ప‌రిచ‌యాలు ఇలా అనేక అంశాల‌ను ఈ స‌మావేశాల్లో చ‌ర్చించి కొత్త తీర్మానాల‌కు పార్టీ స‌న్నాహ‌కాలు చేస్తుంది.

అయితే, క‌రోనా నేప‌థ్యంలో గ‌త రెండేళ్లుగా కూడా ఈ మ‌హానాడును వ‌ర్చువ‌ల్‌గానే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏపీలోని ఒంగోలులో నిర్వహిస్తున్న మ‌హానాడును రెండు రోజుల‌కే ప‌రిమితం చేశారు. అయినప్పటికీ.. అన్ని విష‌యాల‌ను స‌మ‌గ్రంగా చ‌ర్చించి పార్టీ భ‌విత‌కు పునాదులు పటిష్ఠం చేయనున్నారు. ఇదిలాఉంటే.. ఎన్నారై తెదేపా యూఎస్ఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 21 వ‌ర‌కు రెండు రోజుల పాటు మ‌హానాడును నిర్వహించనున్నారు. బోస్టన్‌లోని బెస్ట్ వెస్ట్రన్‌ రాయ‌ల్ ప్లాజా హోట‌ల్‌లో ఈ మ‌హానాడు నిర్వహణకు శ్రీకారంచుట్టారు.

ఎన్నారై తెదేపా యూఎస్ఏ కోఆర్డినేట‌ర్‌గా ఇటీవ‌ల నియ‌మితులైన‌ 'జ‌య‌రాం కోమ‌టి' ఆధ్వర్యంలో ఈ మ‌హానాడును అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి, ఎమ్మెల్సీ ఎంవీఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష‌, తెదేపా  జాతీయ అధికార ప్రతినిధి న‌న్నూరి న‌ర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల  నారాయ‌ణ‌రెడ్డి, అనంత‌పురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌద‌రి, తెదేపా సీనియ‌ర్ నాయ‌కుడు మన్నవ సుబ్బారావు త‌దిత‌రులు హాజ‌రుకానున్నారు.

ఈ నేప‌థ్యంలో బోస్టన్‌లోని మ‌హానాడు నిర్వహణ ఏర్పాట్లను ప‌రిశీలించేందుకు 'జ‌య‌రాం కోమ‌టి' బోస్టన్‌కు చేరుకున్నారు. అతిథుల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లతో పాటు, మ‌హానాడులో చ‌ర్చించే విష‌యాల‌పై ఆయ‌న స‌మీక్ష చేయ‌నున్నారు. ఏపీలో ఏ విధంగా అయితే ఘ‌నంగా నిర్వహిస్తారో.. అంతే ఘ‌నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా జ‌య‌రాం కోమ‌టి చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌, యూట్యూబ్ లైవ్‌ల‌లో ప్రసారం చేసే ఏర్పాట్లు కూడా చేస్తుండ‌డం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని