TANA: తానా తదుపరి అధ్యక్షుడిగా నరేన్‌ కొడాలి

తానా తదుపరి అధ్యక్షుడిగా నరేన్‌ కొడాలి ఎన్నికయ్యారు. జనవరి 18న ప్రకటించిన ఫలితాల ప్రకారం అన్ని జాతీయ పదవులను నరేన్‌ టీమ్‌ చేజిక్కించుకుంది.

Published : 19 Jan 2024 23:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనూహ్య మలుపులతో రెండేళ్లపాటు కొనసాగిన ‘తానా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన తానా ఎన్నికల్లో నరేన్‌ కొడాలి టీమ్‌ ఘన విజయం సాధించింది. తదుపరి తానా అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన నరేన్‌ కొడాలి గెలుపొందారు. జనవరి 18న ప్రకటించిన ఫలితాల ప్రకారం అన్ని జాతీయ పదవులను నరేన్‌ బృందమే చేజిక్కించుకుంది. సుమారు మూడు వేల ఓట్ల ఆధిక్యంతో సతీష్ వేమూరిపై నరేన్ కొడాలి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఘన విజయం సాధించారు. బోర్డు డైరెక్టర్లుగా లావు శ్రీనివాస్, రవి పొట్లూరి, మల్లి వేమన గెలుపొందారు. సెక్రటరీగా రాజా కసుకుర్తి, కోశాధికారిగా భరత్ మద్దినేని, జాయింట్ సెక్రెటరీగా వెంకట్ కోగంటి, జాయింట్ కోశాధికారిగా సునీల్ పాంత్రా ఎన్నికయ్యారు.

గత రెండేళ్లుగా ఒడుదొడుకుల నేపథ్యంలో ఒకసారి ఎన్నికలు రద్దయిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికలతో పూర్తిస్థాయిలో కార్యవర్గం ఏర్పడింది. రద్దయిన మొదటి ఎన్నికల్లో నరేన్ కొడాలికి ప్రత్యర్థిగా నిలిచిన శ్రీనివాస్‌ గోగినేని.. తాజా ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగి నరేన్ ప్యానెల్‌కు మద్దతివ్వడం గమనార్హం. ఈ విజయానికి తానా మునుపటి అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ల, జయరాం కోమటి, సతీష్ వేమన, అంజయ్య చౌదరి లావు, మోహన్ నన్నపనేని తదితరులు కృషి చేశారు.

తానా ఎన్నికల ఫలితాలు ఇవే..

 • ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
 • నరేన్ కొడాలి - 13,225 (విజయం)
 • సతీష్ వేమూరి - 10,362
 • బోర్డు డైరెక్టర్లు
 • లావు శ్రీనివాస్ - 12,695 (విజయం)
 • రవి పొట్లూరి- 13,044 (విజయం)
 • సురీష తూనుగుంట్ల - 11,237
 • మల్లి వేమన - 11,774 (విజయం)
 • శ్రీనివాస్ ఉయ్యూరు - 10,520
 • వెంకట రమణ యార్లగడ్డ- 10,131
 • కార్యదర్శి
 • రాజా కసుకుర్తి - 12,456 (విజయం)
 • అశోక్ కొల్లా - 11,083
 • కోశాధికారి
 • భరత్ మద్దినేని - 12,827 (విజయం)
 • మురళి తాళ్లూరి - 10,617
 • జాయింట్ సెక్రటరీ
 • వెంకట్ కోగంటి - 13,015 (విజయం)
 • వంశీ వాసిరెడ్డి - 10,501
 • జాయింట్ ట్రెజరర్
 • సునీల్ పంత్రా - 13,013 (విజయం)
 • శశాంక్ యార్లగడ్డ - 10,463
 • కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్
 • రజినీ ఆకురాటి - 10,177
 • లోకేష్ కొణిదెల - 13,362(విజయం)
 • సాంస్కృతిక సేవా సమన్వయకర్త
 • రజనీకాంత్ కాకర్ల - 10,854
 • ఉమా ఆర్ కాటికి - 12,638(విజయం)
 • మహిళా సేవల సమన్వయకర్త
 • సోహిని అయినాల- 12,009(విజయం)
 • మాధురి యేలూరి - 11,436
 • కౌన్సిలర్ ఎట్ లార్జ్
 • ప్రదీప్ గడ్డం - 10,590
 • సతీష్ కొమ్మన - 12,827(విజయం)
 • అంతర్జాతీయ సమన్వయకర్త
 • శ్రీధర్ కొమ్మాలపాటి - 10,168
 • ఠాగూర్ మల్లినేని - 13,300(విజయం)
 • స్పోర్ట్స్ సమన్వయకర్త
 • శ్రీరామ్ ఆలోకం - 10,213
 • నాగ పంచుమూర్తి -13,261(విజయం)
 • ఫౌండేషన్ ట్రస్టీ
 • రామకృష్ణ అల్లు - 12,515 (విజయం)
 • భక్త బల్లా - 13,552 (విజయం)
 • శ్రీనివాస్ కూకట్ల - 12,286(విజయం)
 • సత్యనారాయణ మన్నె -11,196
 • రవికిరణ్ మువ్వ - 10,490
 • నాగరాజు నలజుల - 9,883
 • సుమంత్ రామ్ - 9,643
 • రవి సామినేని - 10,148
 • రాజా సూరపనేని - 13,170(విజయం)
 • ఎండూరి శ్రీనివాస్ - 12,261(విజయం)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు