తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ‘తెలుగు భాషా దినోత్సవం’
అట్లాంటా, జార్జియా: వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తానా సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచస్థాయి అంతర్జాల దృశ్యమాధ్యమ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న కార్యక్రమాలలో ఇది 16వ సమావేశం కావడం గమనార్హం. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో గిడుగు వేంకట రామమూర్తి కృషిని, ఆయనకు ఆ ఉద్యమంలో సహకరించిన అనేకమంది సాహితీవేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఓ మధురమైన తెలుగు పద్యం పాడి సభలో తెలుగుదనం నింపారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులకు, వక్తలకు ఆహ్వానం పలికారు. శనివారం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి, తెలుగు సంతతికి చెందిన డా. శశి (పిల్లలమర్రి) పంజాను సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా శశి తండ్రిది (పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య) తెనాలి అని, తల్లిది (మాధవపెద్ది సీతాదేవి) గుంటూరు అని తెలిపారు. శశి, ఆమె సోదరుడు మోహన్ పుట్టింది నరసరావుపేట అయినప్పటికీ చిన్నప్పట్నుంచి కోల్‌కతాలో పెరగడం, విద్యాభ్యాసం, ఉద్యోగంతో పాటు రాజకీయాల్లో రాణించడం ముదావహమన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలిగా తీరికలేకుండా ఉంటూనే రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు.
తెలుగు గడ్డపై పుట్టడం నా అదృష్టం: బెంగాల్ మంత్రి డాక్టర్ శశి పంజా
ఈ సందర్భంగా డా. శశి పంజా మాట్లాడుతూ.. కేంద్ర మాజీమంత్రి అజిత్ కుమార్ పంజా కుమారుడు డా. ప్రసన్నకుమార్ పంజాతో వివాహం కావడం వల్ల తన పేరు శశి పంజాగా మారిందన్నారు. ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేలపై జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన తండ్రి ఉద్యోగరీత్యా కోల్‌కతాలో స్థిరపడడంతో చిన్నప్పట్నుంచి తెలుగు నేలకు దూరమయ్యానని, కానీ తెలుగు భాషకు కాదన్నారు. ఇప్పటికీ తమ ఇంట్లో తెలుగే మాట్లాడతామని, మధురమైన మన తెలుగు భాషను మాట్లాడే వారు బెంగాల్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని గుర్తు చేశారు. తెలుగు వ్యవహారిక భాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వేంకట రామమూర్తి తన సర్వస్వాన్ని త్యాగం చేశారని కొనియాడుతూ.. ఆయనకు నివాళులర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికను ఆమె ప్రశంసించారు.
తానా కృషిని అభినందించిన తనికెళ్ల భరణి
ఈ సభలో ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. విదేశాల్లో, ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. తనికెళ్ల భరణి తెలుగులో రచించిన “ఎందరో మహానుభావులు” గ్రంథాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేయగా.. ఆ ప్రతిని మంత్రి డా. శశి పంజా ఆవిష్కరించారు. తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్‌గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్ ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఎంతో మంది సంగీత విద్వాంసుల జీవిత చరిత్రలను అత్యంత మనోహరంగా భరణి చిత్రీకరించారని, ఇది అందరూ చదవాల్సిన పుస్తకమని ఆయన అన్నారు.
అమ్మ భాషను కాపాడుకుందాం: కరణం మల్లీశ్వరి
రెండో రోజు సభలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెనుంచి సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం సాధించి.. దిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులైన పద్మశ్రీ డా. కరణం మల్లీశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు వ్యక్తిగా పుట్టడం తన అదృష్టమన్నారు. మాతృభాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
తానా ప్రత్యేక వీడియో విడుదల
తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం తెలుగు వైభవం, సాహితీవేత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి విడుదల చేశారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఇకనుంచి ప్రతి నెలా సాహిత్య కార్యక్రమానికి ముందు ఈ వీడియోను ప్రదర్శిస్తామన్నారు. ఈ గీతాన్ని రాసిన తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, స్వరపరచిన సంగీత దర్శకులు నేమాని పార్థసారథి, గానం చేసిన దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తితో సహా మొత్తం 17 మంది లబ్ద ప్రతిష్టులైన విశిష్ట సాహితీవేత్తల కుటుంబ సభ్యులే పాల్గొని ఆ నాటి సామాజిక పరిస్ధితులు, వారి జీవన విధానం, సహ రచయితలతో వారి అనుబంధం, వారి సాహిత్య సృష్టి మొదలైన ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ చర్చా కార్యక్రమాలను ఈ కింది యూట్యూబ్ వీడియోల్లో చూవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట సాహితీవేత్తల కుటుంబ సభ్యులు వీళ్లే..
* డా. తుమ్మల సీతారామమూర్తి చౌదరి (తెనుగు లెంక, ఆధునిక పద్య కవి, పండితుడు) కుమారుడు తుమ్మల శ్రీనివాసమూర్తి
* డా. రాయప్రోలు సుబ్బారావు (గొప్ప జాతీయవాది, ప్రముఖ కవి, రచయిత) మనవరాలు ఆచార్య డా. మనోరమ కానూరి
* డా. కొండవీటి వేంకట కవి (సుప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణల రచయిత) కుమార్తె ఆచార్య డా. కొండవీటి విజయలక్ష్మి
* డా. ముళ్ళపూడి వెంకటరమణ (ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ చలనచిత్ర కథా, హాస్య సంభాషణల రచయిత) కుమారుడు వర ముళ్ళపూడి
* డా. గొల్లపూడి మారుతీరావు (రేడియో ప్రయోక్త, నటుడు, చలనచిత్ర కథా, మాటల రచయిత) కుమారుడు గొల్లపూడి రామకృష్ణ
* బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా (సూఫీ వేదాంతవేత్త, తెలుగు సాహితీ వేత్త, సంఘ సంస్కర్త) ముని మనవడు డా. ఉమర్ ఆలీ షా
* పద్మభూషణ్ డా. గుర్రం జాషువా (కవితా విశారద, కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి) ముని మనవడు గుర్రం పవన్ కుమార్
* పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి (సుప్రసిద్ధ భావకవి, ప్రముఖ చలనచిత్ర గీత రచయిత) మనవరాలు రేవతి అదితం
* కళా ప్రపూర్ణ గిడుగు వేంకట రామమూర్తి (వాడుక భాషోద్యమ పితామహుడు, బహు భాషాశాస్త్రవేత్త) ముని మనవరాలు గిడుగు స్నేహలతా మురళి
* పద్మభూషణ్ డా. బోయి భీమన్న (ప్రముఖ కవి, సామాజిక చైతన్య రచయిత) సతీమణి హైమవతీ భీమన్న
* గురజాడ అప్పారావు (సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి) ముని మనవరాలు అరుణ గురజాడ
* రాష్ట్రేందు డా. గుంటూరు శేషేంద్రశర్మ (ప్రముఖ కవి, విమర్శకుడు, పండితుడు, సాహితీవేత్త) కుమారుడు గుంటూరు సాత్యకి
* పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు (సరస్వతీ పుత్ర, సుప్రసిద్ధ కవి) కుమార్తె డా. పుట్టపర్తి నాగపద్మిని
* పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ (కవి సామ్రాట్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత) మనవడు విశ్వనాథ సత్యనారాయణ
* డా. రావూరి భరద్వాజ (జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, గొప్ప భావకుడు) కుమారుడు రావూరి వెంకట కోటేశ్వర రావు, ఆయన కోడలు లక్ష్మి
* కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి (ప్రముఖ సాహితీవేత్త, కవి) కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ
* దేవరకొండ బాలగంగాధర తిలక్ (అభ్యుదయ కవి, కథకుడు, నాటకకర్త) కుమారుడు డా. దేవరకొండ సత్యనారాయణ మూర్తి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: కేక్ ఎలా తినాలో నేర్చుకున్న హన్సిక.. ఆరెంజ్ జ్యూస్‌తో సంయుక్త!
-
General News
ED: ఈడీ హైదరాబాద్ అదనపు డైరెక్టర్‌గా దినేష్ పరుచూరి నియామకం
-
Sports News
Serena Williams: నేను అబ్బాయిని అయితే.. ఆటను వదిలిపెట్టేదాన్నే కాదు..!
-
India News
CJI: కొత్త సీజేఐగా జస్టిస్ యు.యు.లలిత్ నియామకం
-
Politics News
Nara Lokesh: మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో.. రియలో ప్రజలే తేలుస్తారు: నారా లోకేశ్
-
India News
Omicron: దిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Balineni Srinivasa Reddy: బాలినేని జనసేనకు వెళ్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి
- Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!