BJP: రెండో జాబితా విడుదల.. తెలంగాణలో భాజపా ఎంపీ అభ్యర్థులు వీరే!

లోక్‌సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను భాజపా విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది.

Updated : 13 Mar 2024 22:50 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు 72 మందితో రెండో జాబితాను భాజపా  (BJP) విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఆదిలాబాద్‌ - గోడెం నగేశ్‌, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్‌, మెదక్‌ - రఘునందన్‌రావు, నల్లగొండ - శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌కు సీతారాం నాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. మొదటి జాబితాలో 9 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే.  మొత్తం ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన భాజపా.. ఖమ్మం, వరంగల్‌ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. సైదిరెడ్డి, గోడెం నగేశ్‌, సీతారాం నాయక్‌ ఇటీవలే భారాస నుంచి భాజపాలో చేరారు.

ఇటీవల 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన భాజపా.. తాజాగా 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్‌ హవేలీ (1) దిల్లీ (2), గుజరాత్‌ (7), హరియాణా(6), హిమాచల్‌ప్రదేశ్‌(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్‌ (5), మహారాష్ట్ర(20), , త్రిపుర (1), ఉత్తరాఖండ్‌ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది.

రెండో జాబితాలో పలువురు ప్రముఖులు వీరే..

  • రెండో జాబితాలో కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ జోషీ, పీయూష్‌ గోయల్‌, అనురాగ్‌ ఠాకూర్‌, శోభా కరంద్లాజేతో పాటు మాజీ సీఎంలు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, త్రివేంద్రసింగ్‌ రావత్‌, బసవరాజ్‌ బొమ్మై వంటి ప్రముఖులకు చోటు లభించింది. 
  • మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి నితిన్ గడ్కరీ; ముంబయి నార్త్‌ - పీయూష్‌ గోయల్‌, బీద్‌- పంకజ ముండే
  • హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిర్‌పుర్‌ నుంచి అనురాగ్‌ ఠాకూర్‌
  • హరియాణాలోని కర్నాల్‌ నుంచి మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌
  • కర్ణాటకలో ధార్వాడ్‌ నుంచి ప్రహ్లాద్‌ జోషీ, హవేరీ - బసవరాజ్‌ బొమ్మై; బెంగళూరు రూరల్‌ - డా. సీఎన్‌ మంజునాథ్‌; బెంగళూరు నార్త్‌ - శోభా కరాంద్లాజే, బెంగళూరు సౌత్‌- తేజస్వీ సూర్య
  • ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌; గర్హ్వాల్‌ నుంచి భాజపా ముఖ్య అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ బలౌనీ
  • షిమోగ నుంచి మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని