ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించి విస్మరించడం తగదు

రాష్ట్రంలో 13 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర శాసనసభలో ప్రకటించి అమలును విస్మరించడం తగదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు.

Published : 24 Sep 2023 04:43 IST

ప్రొఫెసర్‌ కోదండరాం

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 13 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర శాసనసభలో ప్రకటించి అమలును విస్మరించడం తగదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో డీఎస్సీ నిరుద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 13,068 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేస్తామని ప్రకటించి 5 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోటీ పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కావడంలేదని, గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టు తీర్పే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ, ఓయూ ఐకాస నేత మహిపాల్‌యాదవ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని