తెలంగాణ ప్రజలను మద్యానికి బానిస చేసిన భారాస

భారాస ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేసిందని భాజపా నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌ విమర్శించారు.

Published : 24 Sep 2023 05:12 IST

భాజపా మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌

ఈనాడు, దిల్లీ: భారాస ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేసిందని భాజపా నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌ విమర్శించారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశానికి ఏం చేయడం లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శిస్తున్నారని, కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, రామ మందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేసీఆర్‌ ఎస్సీలను మోసం చేయడంతో పాటు కాళేశ్వరం మొదలు అన్ని పథకాల్లోనూ అవినీతి చేశారని ఆరోపించారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కేవలం నాలుగు శాతమే అమలవుతున్నాయని, ఈ విషయంతో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు తమతో కలిపి పోరాటం చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని