Mamata Banerjee: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా ప్రణాళికలు మొదలు పెట్టిందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈవీఎంలను భాజపా హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 03 Aug 2023 17:32 IST

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం(EVM)లను హ్యాక్‌ చేసేందుకు భాజపా(BJP) ప్రయత్నిస్తోందని..  అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. విపత్తులు, మతపరమైన ఉద్రిక్తతలు, నిరుద్యోగం నుంచి దేశాన్ని కాపాడేది విపక్ష కూటమి ‘ఇండియా’ మాత్రమేనని అన్నారు. గురువారం ఆమె కోల్‌కతాలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘మాట జాగ్రత్త..!’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన..!

2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీదీ విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలో భాజపా ఇప్పటికే ప్రణాళికలు మొదలు పెట్టిందని..   ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తమకు తెలిసిందన్నారు. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని.. మరికొన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు దీదీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు